అక్షరటుడే, వెబ్‌డెస్క్: Arjun tendulkar | భారత క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ Rahul Dravid ఒకప్పుడు జట్టు సహచరులుగా టీమిండియాకు ప్రాతినిధ్యం వహించగా.. తాజాగా వారి వారసులు ప్రత్యర్థులుగా తలపడ్డారు.
కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ Karnataka Cricket Association ఆధ్వర్యంలో జరుగుతున్న కె. తిమ్మప్పయ్య మెమోరియల్ టోర్నమెంట్ (Thimmappaiah Memorial Tournament) లో అర్జున్ టెండూల్కర్ బౌలింగ్‌లో రాహుల్ ద్రవిడ్ కుమారుడు సమిత్ ద్రవిడ్ Samit Dravid ఔటయ్యాడు.
ఈ మ్యాచ్‌లో సమిత్ ద్రవిడ్ 26 బంతుల్లో 9 పరుగులు చేసి, రెండు బౌండరీలు బాదాడు. క్రీజులో సెట్ అవుతున్న సమయంలో అర్జున్ టెండూల్కర్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్ అవడంతో పెవిలియన్‌కి చేరాడు.
Arjun tendulkar | ఫ్యాన్స్ హ్యాపీ..
లెజెండ్స్ పిల్లల మధ్య పోరుని అభిమానులు ఆస్వాదిస్తూ సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. ఈ టోర్నీలో కర్ణాటక టాప్ ప్లేయర్లు కరుణ్ నాయర్, ప్రసిద్ధ్ కృష్ణలతో పాటు పలు యువ ఆటగాళ్లు రంజీ ట్రోఫీ (Ranji Trophy) 2025-26 సీజన్‌కు సిద్ధమవుతున్నారు.
రంజీకి వార్మప్‌గా ఈ మ్యాచ్‌లు ఉపయోగపడుతున్నాయి. దేశవాళీ క్రికెట్‌లో గోవా తరఫున ఆడుతున్న అర్జున్ టెండూల్కర్ Arjun Tendulkar ప్రస్తుతం తన ఆటను మెరుగుపర్చుకునే క్రమంలో లోకల్ టోర్నీలు ఆడుతున్నాడు.
ఐపీఎల్ IPL లో ముంబయి ఇండియన్స్ తరఫున అవకాశాలు వచ్చినా, తుది జట్టులో స్థానం దక్కకపోవడంతో రంజీలో రాణించి కెరీర్‌లో ముందడుగు వేయాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నాడు.
ఇక వ్యక్తిగతంగా అర్జున్ త్వరలో ఓ ఇంటివాడు కానున్నాడు. ముంబయి వ్యాపారవేత్త రవి ఘాయ్ మనవరాలు సానియా చందోక్ ను ఆయన వివాహం చేసుకోబోతున్నాడు.
ఇద్దరి నిశ్చితార్థం ఇప్పటికే సీక్రెట్‌గా జరిగిందని, సచిన్ టెండూల్కర్ Sachin Tendulkar కూడా ధృవీకరించారు. సానియా, అర్జున్ సోదరి సారా టెండూల్కర్‌కు సన్నిహిత స్నేహితురాలు.
అదే పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు దారితీసింది. లెజెండ్స్ పిల్లల క్రికెట్ పోరుతో పాటు, అర్జున్ పెళ్లి వార్తలతో టెండూల్కర్ ఫ్యామిలీ మరోసారి వార్తల్లో నిలుస్తోంది.