- Advertisement -
Homeబిజినెస్​Gold Market | పసిడి మ‌రింత ప్రియం..నేటి ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే..!

Gold Market | పసిడి మ‌రింత ప్రియం..నేటి ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే..!

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్​: Gold Market | బంగారం ధర Gold Rates లు రోజురోజుకు పెరుగుతూ సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల కారణంగా పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతున్న క్ర‌మంలో బంగారంపై డిమాండ్ ఎక్కువ అవుతోంది.

డాలరుతో పోల్చితే రూపాయి క్షీణించడం కూడా బంగారం ధరలు పెరగడానికి మరో కారణంగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు సెప్టెంబరు 23న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,13,080 కు చేరుకోగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 1,03,660 గా నమోదైంది. వెండి ధరలు నిన్నటితో పోల్చుకుంటే కేజీకి వంద రూపాయల మేర పెరగడం గమనార్హం.

- Advertisement -

Gold Market | ఆగ‌నంటున్న బంగారం..

దేశంలోని వివిధ న‌గ‌రాల‌లో బంగారం ధ‌ర‌లు ఎలా ఉన్నాయ‌నేది చూస్తే.. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,13,230 గా ట్రేడ్ కాగా, 22 క్యారెట్ల ధర రూ. 1,03,810 గా న‌మోదైంది.

ఇక హైదరాబాద్‌, విజయవాడ, ముంబయి, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, కేరళ, పుణె Pune లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 1,13,080 గా ట్రేడ్ కాగా, 22 క్యారెట్ల ధర రూ. 1,03,660 గా న‌మోదైంది.

వడోదరలో 24 క్యారెట్ల ధర రూ. 1,13,130 , 22 క్యారెట్ల ధర రూ. 1,03,710 గా ఉంది. ఇదిలా ఉండగా వెండి ధరలు Silver Prices కూడా పెరుగుతున్నాయి.

ఒక‌వైపు బంగారం పెరుగుతుంటేనే సామాన్యుల గుండెల్లో రైళ్లు ప‌రిగెడుతుంటే, ఇప్పుడు వెండి కూడా ఇలా పెరుగుతూ పోతుండ‌టం సామాన్యుల‌కి ఇబ్బందిగా మారింది.

దేశంలో ని ప్రధాన నగరాల్లో వెండి రేట్లు ఎలా ఉన్నాయ‌నేది చూస్తే.. హైదరాబాద్‌ Hyderabad, విజయవాడ Vijaywada, చెన్నై Chennai, కేరళ Kerala లో వెండి కేజీ ధర రూ. 1,48,100 గా న‌మోదు కాగా, ఢిల్లీ, కోల్‌కతా Kolkata, ముంబయి, బెంగళూరు Bengaluru, వడోదర, అహ్మదాబాద్‌లో వెండి ధర కేజీకి రూ. 1,38,100 గా ట్రేడ్ అయింది.

ఈ ధ‌ర‌లు మ‌రింత పెరిగే అవ‌కాశం కూడా లేక‌పోలేదు. అయితే బంగారం, వెండి రేట్లు మార్కెట్ పరిస్థితుల ఆధారంగా ఎప్పటికప్పుడు మారుతుంటాయి. అందువల్ల కొనుగోలు చేసే ముందు తాజా ధరలు తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News