- Advertisement -
HomeతెలంగాణRising Core Urban City | గ్లోబల్ సిటీకి చిరునామాగా.. తెలంగాణ రైజింగ్ కోర్ అర్బన్...

Rising Core Urban City | గ్లోబల్ సిటీకి చిరునామాగా.. తెలంగాణ రైజింగ్ కోర్ అర్బన్ సిటీ!

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్​: Rising Core Urban City | తెలంగాణ Telangana రైజింగ్ కోర్ అర్బన్ సిటీ ఏరియాను గ్లోబల్ సిటీకి చిరునామాగా సమగ్రమైన ప్రణాళికతో అభివృద్ధి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Chief Minister Revanth Reddy ఆదేశించారు.

మానవ జీవన ప్రమాణాలకు కొలమానమైన విద్య education, వైద్యం medicine, రోడ్డు రవాణా road transport, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే పారిశుద్ధ్యాని sanitation కి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని అన్ని విభాగాల ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు.

- Advertisement -

నగర విస్తరణలో భాగంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలు గ్రేటర్ సిటీకి లక్షలాది కుటుంబాలు వలస వస్తున్నాయని, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను అందించే లక్ష్యంతో ప్రణాళిక రూపొందించాలన్నారు.

తెలంగాణ రైజింగ్ కోర్ – అర్బన్ ఏరియా అభివృద్ధికి సంబంధించి వివిధ ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సంబంధిత శాఖలు, విభాగాల ఉన్నతాధికారులతో సమీక్షించారు.

హైదరాబాద్‌ను ఉన్నతమైన నగరంగా తీర్చిదిద్దడంతో చేపట్టాల్సిన కార్యక్రమాలు, అమలు చేయాల్సిన ప్రణాళికలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వివరిస్తూ, అధికారులకు పలు సూచనలు చేశారు.

కోర్ అర్బన్ సిటీ అభివృద్ధిలో భాగంగా అందరికీ ప్రాథమిక విద్యను అందించే సంస్కరణలు ముందుగా అమలు చేయాలన్నారు. అందుకు జీహెచ్ఎంసీ, కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, కాలేజీలన్నింటినీ గుర్తించాలని సూచించారు.

నర్సరీ నుంచి 4 వ తరగతి వరకు, 5 నుంచి 8 వ తరగతి వరకు, 9 నుంచి ఇంటర్ వరకు 3 కేటగిరీలుగా అందరికీ నాణ్యమైన విద్యను అందించాలని సీఎం ఆదేశించారు. నర్సరీ నుంచి 4వ తరగతి స్కూళ్లపై ముందుగా ఫోకస్ చేయాలన్నారు.

ప్రభుత్వ స్థలాలతోపాటు ఇటీవల కబ్జాలు, ఆక్రమణల నుంచి విముక్తి పొందిన ప్రభుత్వ భూముల్లో స్కూళ్లకు అధునాతన భవనాలు నిర్మించాలని పేర్కొన్నారు. పాఠాశాలలకు సంబంధిత ప్రణాళికను విద్యా శాఖ వెంటనే సిద్ధం చేసి అమలు చేయాలని సూచించారు.

Rising Core Urban City | క్లీన్ ఇమేజ్​ తీసుకురావాలి..

హైదరాబాద్ నగరానికి క్లీన్ ఇమేజీ తీసుకొచ్చేందుకు అధికారులు నిరంతరం శ్రమించాలన్నారు. ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యతనివ్వాలని పేర్కొన్నారు. చెత్త సేకరణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. క్లీన్ సిటీగా రూపొందించే ప్రణాళికలు అమలు చేసే అధికారులకు ప్రోత్సాహకం ఉంటుందని చెప్పారు.

కోర్ అర్బన్ సిటీలో ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు ఉండాలన్నారు. వాటికి అవసరమైన స్థలాలు కేటాయించి, ప్రాధాన్య క్రమంలో భవనాలు నిర్మించే ప్రణాళిక తయారు చేయాలని సూచించారు.

సచివాలయంతో పాటు నగరంలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కాలేజీలన్నీ పునరుత్పాదక విద్యుత్తును మాత్రమే వినియోగించాలన్నారు. వెంటనే కార్యాలయాలపై సోలార్ విద్యుత్తు ప్లాంట్లను అమర్చాలని ఆదేశించారు.

నాలాలు, కుంటలు, చెరువుల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యమివ్వాలన్నారు. నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములను కాపాడేందుకు డిజిటల్ ల్యాండ్ డేటాబేస్ విధానం అమలు చేయాలన్నారు.

నగరంలో ట్రాఫిక్ నియంత్రణ సమర్థంగా జరిగేందుకు అధునాతన సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. నగరంలో ఉన్న అన్ని జంక్షన్లను కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానం చేయాలని సూచించారు.. గూగుల్ సహకారంతో ట్రాఫిక్ ఇబ్బందులను అధిగమించే ప్రణాళిక పోలీసు విభాగం వెంటనే అమలు చేయాలన్నారు.

కోర్ అర్బన్ సిటీలో మున్సిపల్ municipal, పోలీస్ police, విద్యుత్‌ electricity, జలమండలి water board departments విభాగాల యూనిట్లు, వాటిని పర్యవేక్షించే అధికారుల పరిధి ఒకేతీరుగా ఉండాలన్నారు.

నగరంలో డ్రైనేజీ, మ్యాన్‌హోల్స్ క్లీనింగ్ కోసం రోబోటిక్ యంత్రాలను వాడాలని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ మహాప్రస్థానం తరహాలో మూసీ పరివాహకంలో ఉన్న అంబర్‌పేట్ స్మశాన వాటికను అధునాతనంగా అభివృద్ధి చేయాలని సూచించారు.

హుస్సేన్ సాగర్ చుట్టూ నెక్లెస్ రోడ్, ఇందిరా పార్క్, సంజీవయ్య పార్క్ ప్రాంతాన్ని అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దాలన్నారు. ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా హుస్సేన్ సాగర్ 2.0 ను అన్ని హంగులతో అభివృద్ధి చేయాలని చెప్పారు.

స్కై వాక్, సైకిల్ ట్రాక్‌తో పాటు మల్టీ లెవల్ పార్కింగ్‌ను, పర్యాటకులను ఆకట్టుకునే నిర్మాణాలు చేపట్టాలన్నారు. కోర్ అర్బన్ సిటీలో ఉన్న పార్కులన్నింటినీ పిల్లలను ఆకట్టుకునేలా, ఆహ్లాదంగా ఉండేలా అభివృద్ధి చేయాలని చెప్పారు.

వీధి వ్యాపారుల కోసం ప్రత్యేక వెండింగ్ జోన్స్‌ను ఏర్పాటు చేయాలన్నారు. బహుళ అంతస్తుల భవనాల్లో ఫైర్ సేఫ్టీ అంశాలపై అత్యంత పకడ్బందీ వ్యవస్థ ఉండాలని స్పష్టం చేశారు. వీధి దీపాలకు సోలార్ విద్యుత్ వినియోగం, కొత్తగా పునరుద్ధరిస్తున్న చెరువుల వద్ద పైలట్ ప్రాజెక్టుగా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలని సూచించారు.

డ్రగ్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దేందుకు కఠిన చర్యలు అమలు చేయాలన్నారు. డ్రగ్స్, గంజాయి సేవించి పట్టుబడితే బాధితులుగా చూడవద్దని, కనీసం పది రోజుల పాటు రీహాబిలిటేషన్ సెంటర్‌లో ఉంచాలన్నారు. చర్లపల్లి జైలు ప్రాంగణంలోనే ఈ రీహాబిలిటేషన్ సెంటర్ నిర్మించాలని ముఖ్యమంత్రి చెప్పారు.

ఈ సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ జితేందర్​తో పాటు ఆయా విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

- Advertisement -
- Advertisement -
Must Read
Related News