- Advertisement -
Homeజిల్లాలుకామారెడ్డిYellareddy | ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాలు..

Yellareddy | ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాలు..

- Advertisement -

అక్షర టుడే, ఎల్లారెడ్డి: Yellareddy | జిల్లాలో దుర్గాదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు (Sharannavaratri celebrations) సోమవారం ప్రారంభమయ్యాయి. వాడవాడలా ఏర్పాటు చేసిన మండపాల్లో నిర్వాహకులు అమ్మవారి విగ్రహాలను ప్రతిష్టించి ప్రత్యేక పూజలు (special pujas) నిర్వహించారు. పలువురు అమ్మవారి దీక్ష చేపట్టి తొమ్మిది రోజుల పాటు అమ్మ వారిని తొమ్మిది రూపాల్లో పూజిస్తారు.

– శుద్ధ పాడ్యమి 22 నుంచి అక్టోబర్ 3 విజయ దశమి (Vijaya Dashami) వరకు నవరాత్రి ఉత్సవాలు జరుగనున్నాయి. అక్టోబర్ 3న శోభాయాత్ర నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

- Advertisement -

Yellareddy | ఎల్లారెడ్డిలో ఘనంగా ప్రారంభమైన ఉత్సవాలు

ఎల్లారెడ్డి పట్టణ (Yellareddy Town) కేంద్రంలోని వివిధ మండపాల వద్ద మొదటి రోజు అమ్మవారు బాల త్రిపుర సుందరి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీరామసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిర్వాహకులు అమ్మవారి మాలను ధరించారు. అలాగే అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోచమ్మ ఆలయంలో చైతన్య యూత్, హిందూ యువ సేన (Chaitanya Youth and Hindu Yuva Sena) ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అమ్మవారి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి మాలను ధరించారు. ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో అమ్మవారిని ప్రతిష్టించి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.

Yellareddy | పటిష్ట పోలీసు భద్రత

నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయాలు, దుర్గామాత మండపాల (Durga Mata Mandapams) వద్ద పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. నేటి నుంచి మరింత భద్రత పెంచనున్నారు. శోభాయాత్ర రోజు ప్రత్యేక బలగాలతో బందోబస్తు కల్పించనున్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News