అక్షరటుడే, న్యూఢిల్లీ: Axis Bank | భారత్‌లోని అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంకులలో ఒకటైన యాక్సిస్ బ్యాంకు.. తన వినియోగదారుల పండుగ సెలబ్రేషన్స్ ను మరింత ఆనందభరితంగా మార్చాలని నిర్ణయించుకుంది.
ఈమేరకు ‘దిల్ సే ఓపెన్ సెలబ్రేషన్స్ 2025’ (Dil Se Open Celebrations 2025) అనే క్యాంపెయిన్‌ను దేశవ్యాప్తంగా మొదలెట్టింది. ఇదే నెల (సెప్టెంబరు 2025) లో ప్రారంభమైన ఈ క్యాంపెయిన్ (campaign) కొన్ని నెలలపాటు కొనసాగనుంది.
భారీ డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు, రివార్డులు, ప్రత్యేక భాగస్వామ్య ఒప్పందాలు ఇందులో ఉన్నాయి. ఈ ఆఫర్లు “కేవలం పండుగకే కాదు.. పండుగ సీజన్ మొత్తం కొనసాగుతుంది” అనే నినాదాన్ని బ్యాంకు ఇచ్చింది.
అంటే వినియోగదారులకు పండుగ ఆనందాన్ని, విలువను, ప్రయోజనాలను ఒకే పండుగకు పరిమితం చేయకుండా సీజన్ పొడవునా అందించేందుకు చర్యలు తీసుకుంటోంది. నవరాత్రి (Navratri), దీపావళి (Diwali) నుంచి క్రిస్మస్ (Christmas) వరకు, ఆ తర్వాత కూడా ఈ ఆఫర్లు కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది.
వినియోగదారులు డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు, భాగస్వామ్య ఒప్పందాలు, రివార్డ్ ప్రోగ్రామ్‌లతో సహా అనేక ప్రత్యేక ప్రయోజనాలను యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డులు, ఇతర బ్యాంకింగ్ సేవల ద్వారా పొందుతారు.
ఈ ఆఫర్లు అనేక కేటగిరీలలో విస్తరించి ఉన్నాయి. ఇందులో ఈ-కామర్స్ (అమెజాన్ Amazon, ఫ్లిప్‌కార్ట్ Flipkart), ఎలక్ట్రానిక్స్ (హైయర్, ఎల్‌జీ, శాంసంగ్, సోనీ), మొబైల్స్ (వన్ ప్లస్, మోటొరోలా, షావోమి), క్విక్ కామర్స్ (బ్లింకిట్, బిగ్ బాస్కెట్, ఇన్‌స్టామార్ట్), షాపింగ్ (జాక్&జోన్స్, వెరో మోడా, ఓన్లీ, సెలెక్టెడ్, షాపర్స్ స్టాప్, టిరా, కోచ్, మైఖేల్ కోర్స్, మదర్ కేర్, హామ్లీస్ వంటి రిలయన్స్ బ్రాండ్స్), ట్రావెల్ (కథాయ్ పసిఫిక్, క్లియర్‌ట్రిప్, ఐటీసీ హోటల్స్ లిమిటెడ్, ఇక్సిగో, మేక్‌మైట్రిప్, శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్) వంటి టాప్ బ్రాండులు ఉన్నాయి.
Axis Bank | ఈఎంఐలు సహా ప్రత్యేక ప్రయోజనాలు..
యాక్సిస్ బ్యాంకు ప్రెసిడెంట్ & హెడ్ – కార్డ్స్, పేమెంట్స్, వెల్త్ మేనేజ్‌మెంట్ అర్నికా దీక్షిత్ మాట్లాడుతూ.. “యాక్సిస్ బ్యాంకులో ‘దిల్ సే ఓపెన్ సెలబ్రేషన్స్ 2025’ ద్వారా షాపింగ్, ప్రయాణం, జీవనశైలిలో మెరుగైన పండుగ క్యాంపెయిన్‌ను ప్రవేశపెడుతున్నాం. ప్రముఖ బ్రాండ్‌లతో కలిసి, క్యాష్‌బ్యాక్, ప్రత్యేక డిస్కౌంట్లు, అధిక కొనుగోళ్లపై సులభమైన ఈఎంఐలు సహా ప్రత్యేక క్రెడిట్ కార్డు ప్రయోజనాలను అందిస్తున్నాం..” అని వివరించారు.
ఈ క్యాంపెయిన్‌పై యాక్సిస్ బ్యాంకు చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్, అనూప్ మనోహర్ మాట్లాడుతూ.. “భారతీయులు అనేక పండుగలు నిర్వహించుకుంటారు. ప్రతి పండుగకు దానికంటూ ఒక సాంస్కృతిక ప్రాముఖ్యం, భావోద్వేగం ఉంటుంది. ‘దిల్ సే ఓపెన్ సెలబ్రేషన్స్ 2025’తో మేము ఈ వాస్తవికతను ప్రతిబింబించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ క్యాంపెయిన్ మొత్తం పండుగ సీజన్లో వినియోగదారులతో పాటు ఉంటుంది..” అని పేర్కొన్నారు.