- Advertisement -
Homeబిజినెస్​BOI FinShield Hackathon | బీఓఐ ఫిన్‌షీల్డ్ హ్యాకథాన్ విజేతలకు అవార్డుల ప్రదానం

BOI FinShield Hackathon | బీఓఐ ఫిన్‌షీల్డ్ హ్యాకథాన్ విజేతలకు అవార్డుల ప్రదానం

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: BOI FinShield Hackathon | బ్యాంక్ ఆఫ్ ఇండియా (Bank of India – BOI) ఆధ్వర్యంలో ముంబయి (Mumbai) లోని BOI ప్రధాన కార్యాలయంలో ‘ఫిన్‌షీల్డ్ హ్యాకథాన్ 2025’ గ్రాండ్ ఫినాలే ఘనంగా జరిగింది.

ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఫిన్‌టెక్ (FinTech), సైబర్ సెక్యూరిటీ (Cyber ​​Security) లో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో పీఎస్‌బీ హ్యాకథాన్ సిరీస్ 2025లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు.

- Advertisement -

డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (Department of Financial Services – DFS) సెక్రటరీ ఎం.నాగరాజు, జాయింట్ సెక్రటరీ మనోజ్ అయ్యప్పన్, BOI ఎండీ & సీఈఓ రజనీష్ కర్ణాటక్ Karnatak, IIT హైదరాబాద్‌ (IIT Hyderabad) కు చెందిన శోభన్ ఈ కార్యక్రమంలో హాజరయ్యారు.

బ్యాంకింగ్ రంగానికి అవసరమైన పరిష్కారాలను కనుగొనే లక్ష్యంతో దేశవ్యాప్తంగా విద్యార్థులు, నిపుణులు, స్టార్టప్‌ల నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. మొత్తం 661 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 72 జట్లను ఎంపిక చేశారు. కాగా, 18 జట్లు ఫైనల్‌కు చేరుకున్నాయి.

BOI FinShield Hackathon | విజేతలకు నగదు బహుమతులు..

రెండు ప్రధాన సమస్యలకు సంబంధించిన విజేతలకు రూ. 5 లక్షలు, రూ. 3 లక్షలు, రూ. 2 లక్షల నగదు బహుమతులు అందించారు.

సమస్య 1: క్రెడిట్ రిస్క్ మేనేజ్‌మెంట్

మొదటి బహుమతి: డూమ్ ఎన్ గ్లూమ్

రెండో బహుమతి: యాక్షన్‌కామెన్

మూడో బహుమతి: ఫిన్‌క్లూషన్

ప్రత్యేక జ్యూరీ అవార్డు: SQUIRTLE

సమస్య 2: మొబైల్ & ఇంటర్నెట్ బ్యాంకింగ్‌లో మోసాల గుర్తింపు

మొదటి బహుమతి: జిజ్ఞాస

రెండో బహుమతి: వజ్ర

మూడో బహుమతి: టీం కవచ్

ప్రత్యేక జ్యూరీ అవార్డు: Mnemonics

విజేతలకు నాగరాజు, మనోజ్ అయ్యప్పన్, కర్ణాటక్ ట్రోఫీలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ హ్యాకథాన్ విద్యార్థులకు వాస్తవ ప్రపంచ సమస్యల గురించి అవగాహన కల్పించిందన్నారు.

ఈ కార్యక్రమం పీఎస్‌బీ సమాజానికి ఒక బెంచ్‌మార్క్‌ను సెట్ చేసిందని నాగరాజు ప్రశంసించారు. BOI తీసుకుంటున్న డిజిటల్, సాంకేతిక కార్యక్రమాలను అభినందించారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News