అక్షర టుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | నగరంలోని వన్ టౌన్ పరిధిలో బైక్ చోరీ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ఎస్‌హెచ్‌వో రఘుపతి (SHO Raghupathi) తెలిపారు. ఈనెల 19న తూంపల్లికి చెందిన భూక్య విఠల్ తన బైక్‌ను బస్టాండ్ వద్ద పార్క్ చేసి లోపలికి వెళ్లి తిరిగి రాగా.. బైక్ కనిపించలేదు.
దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు (investigation) చేపట్టిన పోలీసులు.. దేవి రోడ్ వద్ద సోమవారం వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సమయంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నించారు. దీంతో వారిని వెంబడించి పట్టుకోగా, నిర్మల్ జిల్లా (Nirmal district) భైంసా పట్టణానికి చెందిన హనువాతే భీం, సుభాష్‌గా గుర్తించారు. మద్యం, జల్సాలకు అలవాటు పడి బైక్ దొంగతనాలు చేస్తున్నట్టు ఒప్పుకున్నారు. భైంసా, నందిపేట్, బాల్కొండ ప్రాంతాల్లోనూ బైక్ దొంగతనాలు చేసినట్టు పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి 4 బైక్‌లు స్వాధీనం చేసుకుని, వారిని రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు.