- Advertisement -
Homeజిల్లాలునిజామాబాద్​GST Rates | జీఎస్టీ తగ్గింపు ధరల పట్టిక ఏర్పాటు చేయాలి

GST Rates | జీఎస్టీ తగ్గింపు ధరల పట్టిక ఏర్పాటు చేయాలి

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: GST Rates | జీఎస్టీ తగ్గింపు (GST reduction) నేపథ్యంలో వ్యాపారస్తులు తమ సముదాయంలో ధరల పట్టిక ఏర్పాటు చేయాలని వాణిజ్య పనుల శాఖ కమిషనర్ హరిత తెలిపారు. జిల్లాలోని బోధన్ (Bodhan), నిజామాబాద్ (Nizamabad) సర్కిళ్లను సోమవారం సందర్శించారు. అధికారులు, వ్యాపారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఐటీ రిటర్న్​లను (IT returns) సమయానికి సక్రమంగా దాఖలు చేయాలన్నారు. అలాగే జీఎస్టీ రేట్ల (GST Rates) మార్పులను పన్ను చెల్లింపుదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి అధికారి బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని తెలిపారు. ప్రధానంగా తగ్గించిన జీఎస్టీలను ప్రజలకు తెలిసేలా బోర్డులను ఏర్పాటు చేయించాలన్నారు. అనంతరం జిల్లాలోని అన్ని సర్కిల్ కార్యాలయాలను పరిశీలించారు.

- Advertisement -

GST Rates | చలాన్ స్కాంపై సమీక్ష

గతంలో రాష్ట్రంలోనే సంచలనంగా మారిన బోధన్ చలాన్ స్కాంపై (Bodhan challan scam) వాణిజ్య పనుల శాఖ కమిషనర్ ప్రత్యేకంగా సమీక్షించారు. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులతో సమావేశమయ్యారు. పెండింగ్ బకాయిలు చెల్లించాలని కోరారు. చెల్లించని వారికి ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్లు గుర్తు చేశారు. ఇకనైనా బకాయిలను చెల్లించాలని లేకపోతే చర్యలు తప్పవన్నారు. కొంతమంది పన్ను చెల్లింపుదారులు ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయని పేర్కొన్నారు. అనంతరం సర్కిల్ వారిగా చెక్కుల కేసులను పరిశీలించారు. నిబంధనల ప్రకారం బకాయిలు వసూలు చేయాలని అధికారులను ఆదేశించారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News