అక్షర టుడే, ఇందల్వాయి: Indalwai Mandal | మండలంలోని గౌరారం గ్రామ పంచాయతీ (Gouraram gram panchayat) పరిధిలో గల లింగాపూర్‌లో పంచాయతీ కారోబార్ రవి ప్రభుత్వ స్థలాన్ని (government land) కబ్జా చేయడమే కాకుండా, దళితులను బెదిరిస్తున్నాడని దళితవాడకు చెందిన మహిళలు వాపోయారు. ఈ మేరకు సోమవారం మీడియాతో మాట్లాడారు.
గ్రామంలోని ఏడో వార్డులో 30 ఏళ్ల కిందట ప్రభుత్వ స్థలంలో వాటర్ ట్యాంక్ నిర్మించారని, ఆ ట్యాంక్ పక్కనే మరో బోరు ఉండేదన్నారు. కారాబార్‌గా పనిచేస్తున్న రవి వాటర్ ట్యాంక్ పక్కన ఇంటి నిర్మాణం చేపట్టగా, మరికొందరు దళితులు ఇందిరమ్మ ఇళ్లను (Indiramma’s houses) నిర్మించుకుంటున్నారని, అయితే వాటర్ ట్యాంక్ నుంచి ఇందిరమ్మ ఇళ్లకు పైపుల ద్వారా నీరు పడుతుండగా మహిళలను అసభ్య పదజాలంతో దూషిస్తున్నాడని వాపోయారు. వాటర్ ట్యాంక్ తన స్థలంలో ఉందని, కూల్చివేస్తానంటూ బెదిరిస్తున్నట్లు వారు తెలిపారు. పలుమార్లు పైపులు బిగించిన ప్రతిసారి తొలగించి ధ్వంసం చేస్తున్నాడన్నారు. దౌర్జన్యం చేస్తున్న కారోబార్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.
Indalwai Mandal | ఎంపీడీవో దృష్టికి తీసుకెళ్తాను..
ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి ప్రేమలతను (Panchayat Secretary Premalatha) వివరణ కోరగా తాను రెండు నెలల క్రితమే గ్రామానికి వచ్చానని, తాను విధుల్లో చేరే సమయానికి అక్కడ ఇంటి నిర్మాణం కొనసాగుతుందని తెలిపారు. స్థల వివాదం విషయంలో పూర్తి నివేదికను ఎంపీడీవోకు అందించినట్లు తెలిపారు.