అక్షర టుడే, ఆర్మూర్ : Armoor Town | ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని కొటార్ముర్లో ఇరిగేషన్ భూముల్లో అక్రమంగా నిర్మిస్తున్న శ్రీ లక్ష్మీనరసింహ ఇన్ఫ్రా సంస్థ కట్టడాలను నిలిపివేయాలని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పూజా నరేందర్ (BRS town president Pooja Narender) డిమాండ్ చేశారు.
ఈ మేరకు సోమవారం ఇరిగేషన్ డీఈఈ కృష్ణమూర్తికి (Irrigation DEE Krishnamurthy) వినతిపత్రం అందజేశారు. ఇరిగేషన్ శాఖకు చెందిన భూమిలో అక్రమ కట్టడాలు చేపడుతూ తప్పుడు సమాచారంతో ఎన్వోసీ తీసుకున్నారని వివరించారు. అపార్ట్మెంట్ నిర్మిస్తున్న స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఎన్వోసీ రద్దు చేయడంతోపాటు, ఇరిగేషన్ భూమిలో నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. సదరు స్థలాన్ని కాపాడాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు అగ్గు క్రాంతి పాల్గొన్నారు.