అక్షర టుడే, కామారెడ్డి: Kamareddy Collector | అధిక వర్షాలతో కామారెడ్డి పట్టణంలో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతు కోసం ప్రత్యేక బృందం ఏర్పాటు చేసినటు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) తెలిపారు. పట్టణంలో దెబ్బతిన్న రోడ్లను సీసీతో 60 రోజుల్లో పూడ్చివేయిస్తామన్నారు.
ఈ మేరకు కలెక్టరేట్‌లో సోమవారం తక్షణ మరమ్మతుల కోసం ఏర్పాటు చేసిన వాహనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అధిక వర్షాలతో పట్టణంలో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతు పనులను వేగంగా చేపట్టేందుకు ఈ ప్రత్యేక వాహనాల (special vehicles) ద్వారా టీంలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ బృందం సభ్యులు పట్టణంలోని అన్ని వార్డుల్లో రోడ్లపై గుంతలు గుర్తించి మరమ్మతులు చేస్తారన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చందర్ నాయక్, మున్సిపల్ డీఈఈ, ఏఈలు, తదితరులు పాల్గొన్నారు.