అక్షరటుడే, గాంధారి: Gandhari mandal | గాంధారి మండలంలోని పేట్ సంగెం ఉన్నత పాఠశాల (Pet Sangem High School) విద్యార్థులు రాష్ట్ర స్థాయి కబడ్డీ జట్లకు కెప్టెన్లుగా సారథ్యం వహించనున్నారు. వ్యాయామ ఉపాధ్యాయుడు లక్ష్మణ్ రాథోడ్ తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సరస్వతి శిశుమందిర్ క్రీడా మైదానంలో జరిగిన సబ్ జూనియర్ జిల్లా స్థాయి కబడ్డీ టోర్నీలో (district-level kabaddi tournament) పేట్ సంగెం విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చారు.
దీంతో రాష్ట్ర స్థాయి బాలికల జట్టుకు బాలికల జట్టుకు భానుతుషా, బాలుర జట్టుకు బుక్య అర్జన్లను ఎంపిక చేశారు. అలాగే అదే పాఠశాలకు చెందిన అవంతిక కూడా సెప్టెంబర్ 25న నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలంలోని ఇండోర్ స్టేడియంలో (indoor stadium) జరిగే రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. విద్యార్థుల ఎంపికపై భామన్ స్పోర్ట్స్ ఫౌండేషన్ బాధ్యులు సురేందర్, అధ్యక్షుడు సేవాంతరాథోడ్, గ్రామస్థులు అభినందించారు.