అక్షరటుడే, ఇందూరు: Bathukamma | గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో (Giriraj Government Degree College) సోమవారం బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. మహిళా అధ్యాపకులు విద్యార్థినులు తీరొక్క పూలతో బతుకమ్మలను (Bathukammas) చేశారు. కళాశాల ప్రాంగణంలో ఆటపాటలతో సందడి చేశారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రామ్మోహన్ రెడ్డి (Principal Rammohan Reddy) మాట్లాడుతూ బతుకమ్మ తెలంగాణ రాష్ట్ర పండుగ అని అన్నారు. ప్రకృతిని ఆరాధించే ప్రత్యేకమైన పండుగ అని కొనియాడారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ రంగరత్నం, పీఆర్వో దండు స్వామి, ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ కో–ఆర్డినేటర్ నహీదా బేగం, రజిత, నాగజ్యోతి, ప్రతిభ, నవీన, లావణ్య, శ్రీలేఖ, రామస్వామి తదితరులు పాల్గొన్నారు.