అక్షరటుడే, లింగంపేట: Lingampet mandal | లింగంపేట మండలం లింగంపల్లి కుర్దు గ్రామ సమీపంలోని కేకేవై రహదారిపై (KKY road) గల పాములవాగు తాత్కాలిక వంతెన పనులు నత్తనడకన సాగుతున్నాయని బీజేపీ మండలాధ్యక్షుడు బొల్లారం క్రాంతికుమార్ (Bollaram Krantikumar) అన్నారు. ఈ మేరకు ఎంపీడీవోకు సోమవారం వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా క్రాంతికుమార్ మాట్లాడుతూ.. వంతెన కుంగిపోయి కామారెడ్డి – లింగంపేట – ఎల్లారెడ్డి నిజాంసాగర్‌కు (Nizamsagar) బస్సుల రాకపోకలు నిలిచిపోయన్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వివరించారు. వర్షం కురిసి 20 రోజులు దాటినా ఇప్పటివరకు తాత్కాలిక వంతెన పూర్తి చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనన్నారు. వెంటనే వంతెన పనులు పూర్తి చేసి ప్రజల ఇబ్బందులు తొలగించాలని కోరారు.