అక్షరటుడే, మెండోరా: Balkonda mandal | బాల్కొండ మండలం కిసాన్‌నగర్ పీహెచ్సీలో జరుగుతున్న స్వస్త్ నారీ సశక్తి కుటుంబ అభియాన్ (Swast Nari Sashakti Kutumbhu Abhiyan) వైద్య శిబిరాన్ని డీఎంహెచ్‌వో రాజశ్రీ (DMHO Rajshri) సోమవారం తనిఖీ చేశారు. మహిళలు, చిన్నపిల్లలకు వైద్య పరీక్షలు చేసి, అవసరమైన వారికి మందులు అందజేయాలని ఆదేశించారు.
ప్రజలు ఆరోగ్యంపై శ్రద్ధ వహించడంతో పాటు అనారోగ్యానికి గురైతే సకాలంలో వైద్య సాయం ఎంతో అవసరమని వివరించారు. ఆస్పత్రిలో మందుల లభ్యత, నిర్వహించిన పరీక్షల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన వైద్యం అందించేందుకు వైద్య సిబ్బంది (medical staff) అందుబాటులో ఉండాలని సూచించారు. ఆమె వెంట డీఎస్వో నాగరాజు, డాక్టర్ స్రవంతి, వైద్య సిబ్బంది యశ్వంత్, భానుప్రియ, మధు, నవీన్, ల్యాబ్ టెక్నీషియన్ వీరయ్య గౌడ్, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు ఉన్నారు.