అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Air India | ఎయిర్ ఇండియా విమానంలో తీవ్ర కలకలం రేగింది. విమానంలోని కాక్‌పిట్ డోర్‌ను తెరవడానికి ఒక ప్రయాణికుడు యత్నించాడు.
గతంలో పలుమార్లు విమానాలు హైజాక్ కావడంతో ఎయిర్‌లైన్ సంస్థలు(Airlines) విమానాల్లో కాక్‌పిట్ డోర్లను ఏర్పాటు చేశాయి. కాక్పిట్లోనికి వెళ్లడానికి ప్రయాణికులకు అనుమతి లేదు. అయితే సోమవారం ఎయిరిండియా విమానంలో ఓ ప్రయాణికుడు ఆ డోర్ తీయడానికి యత్నించాడు. బెంగళూరు నుంచి వారణాసి వెళ్తున్న విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. డోర్ ఓపెన్ చేస్తే ఫ్లైట్ హైజాక్ అవుతుందన్న భయంతో పైలట్ తెరవలేదు.
Air India | టాయ్‌లెట్ కోసం వెళ్లి..
ఈ ఘటనపై ఎయిర్ ఇండియా(Air India) స్పందించింది. సదరు ప్రయాణికుడు తొలిసారి విమానం ఎక్కినట్లు పేర్కొంది. దీంతో టాయ్‌లెట్ డోర్ అనుకొని కాక్‌పిట్ డోర్(Cockpit Door) తెరవడానికి యత్నించాడని ఒక ప్రకటనలో తెలిపింది. పటిష్టమైన భద్రత, ప్రోటోకాల్‌లు అమలులో ఉన్నాయని రాజీపడలేదని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రతినిధి ఒకరు తెలిపారు.
Air India | ఘటనపై దర్యాప్తు
విమానం ల్యాండ్ అయిన తర్వాత ఈ విషయాన్ని సిబ్బంది సంబంధిత అధికారుల దృష్టికి తీసుకు వెళ్లారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకొని పోలీసులు ప్రశ్నించారు. తాను టాయిలెట్ డోర్ అనుకొని తెరిచే యత్నం చేసినట్లు ఆయన తెలిపాడు. అయితే సిబ్బంది అతడికి అది కాక్‌పిట్ డోర్ అని చెప్పడంతో వెను తిరిగినట్లు సమాచారం. కాగా సదరు ప్రయాణికుడితో మరో ఏడుగురు విమానంలో ప్రయాణిస్తున్నట్లు సమాచారం. వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది.