- Advertisement -
HomeతెలంగాణJob Notification | నిరుద్యోగులకు గుడ్​న్యూస్​.. విద్యుత్‌ సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నిర్ణయం

Job Notification | నిరుద్యోగులకు గుడ్​న్యూస్​.. విద్యుత్‌ సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నిర్ణయం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Job Notification | రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్​ న్యూస్​ చెప్పింది. విద్యుత్​ సంస్థల్లో పలు పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది.

రాష్ట్రంలో విద్యుత్​ శాఖ పరిధిలో ట్రాన్స్​కో (Transco), జెన్​కో, ఎన్​పీడీసీఎల్ (NPDCL)​, ఎస్​పీడీసీఎల్​ ఉన్నాయి. గతంలో ఆయా సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి విడివిడిగా నోటిఫికేషన్లు విడుదల చేసేవారు. ఇక నుంచి అన్ని సంస్థల్లో పోస్టుల భర్తీకి కామన్​ నోటీఫికేషన్​ జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అభ్యర్థుల ప్రయోజనార్థం ఒకే నోటిఫికేషన్‌ జారీ చేయాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం తెలిపింది.

- Advertisement -

Job Notification | మూడు వేల పోస్టులు

విద్యుత్​ శాఖ పరిధిలో మొత్తం 3 వేల పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ట్రాన్స్‌కోలో 122 ఖాళీలు ఉన్నట్లు గుర్తించారు. జెన్‌కోలో 283 పోస్టులు, ఎస్​పీడీసీఎల్​లో 135, ఎన్‌పీడీసీఎల్‌ (SPDCL)లో 394 ఖాళీలు గుర్తించారు. మొత్తం 934 ఖాళీల జాబితా సిద్ధం చేశారు. మిగతా ఖాళీలు, పోస్టుల వివరాలు సేకరించి ఒకేసారి మూడు వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్​ ఇవ్వనున్నట్లు సమాచారం.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News