అక్షరటుడే, కోటగిరి: Pothangal mandal | కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ఛైర్మన్ కాసుల బాలరాజ్ (Kasula Balaraj) అన్నారు. పోతంగల్ మండల కేంద్రంలోని సాయిబాబా మందిరం కల్యాణ మండపంలో (Sai Baba Mandir Kalyana Mandapam) సోమవారం ఉమ్మడి మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తెల్ల రేషన్ కార్డుదారులకు (white ration card holders) తమ ప్రభుత్వం సన్న బియ్యం అందిస్తోందని, రైతులకు రుణమాఫీ చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని అన్నారు. త్వరలో బోనస్ డబ్బులు కూడా అందజేస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) అందిస్తున్న పథకాలు, చేస్తున్న అభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరించాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు రానివారికి మంజూరు చేస్తామన్నారు.
Pothangal mandal | స్థానిక ఎన్నికల్లో గెలిపించాలి
హాస్టళ్లలో పిల్లలకు సన్న బియ్యం భోజనం పెట్టిస్తున్నామని, మెస్ చార్జీలు పెంచామని తెలిపారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో (local elections) నాయకులు అందరూ కలిసికట్టుగా పనిచేసి భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని కార్యకర్తలకు సూచించారు. కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ గైక్వాడ్ హన్మంత్, మండల అధ్యక్షుడు పుప్పాల శంకర్, షాహిద్, జిల్లా వైస్ ప్రెసిడెంట్ గంధపు పవన్, జిల్లా డెలిగేట్ కొట్టం మనోహర్, కామారెడ్డి జిల్లా యూత్ ప్రెసిడెంట్ మధుసూదన్ రెడ్డి, ఉమ్మడి మండలాల యూత్ అధ్యక్షులు చాంద్ పాషా, కేశ వీరేశం, యూత్ నాయకులు గంధపు రాజు, మన్సూర్, దత్తు, దిగంబర్ తదితరులు పాల్గొన్నారు.