అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kantara Chapter 1 | కన్నడ సూపర్ హిట్ చిత్రం కాంతార ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మూవీకి ప్రీక్వెల్‌గా కాంతార చాప్టర్ 1 రూపొందుతుంది. మూడో శతాబ్దంలో కదంబ వంశ పరిపాలనా కాలంలో ఈ చిత్ర నడుస్తుందని టాక్.
అప్పటి అరణ్యాల్లో దైవాంశ మూర్తీభవించిన భూతకోల ఆవిర్భావం, తదనంతర ఉత్కంఠభరిత పరిణామాలతో చిత్రాన్ని చాలా థ్రిల్లింగ్‌గా తెరకెక్కించారట. క్లైమాక్స్ మరింత ఆసక్తికరంగా ఉండనుండగా, దాని కోసం దాదాపు 500 మంది ఫైటర్లు, వారికి సహాయకులు 3000 మంది పాల్గొన్నట్టు సమాచారం. ఈ చిత్రం భారతీయ సినీ చరిత్రలో సరికొత్త రికార్డు అని అంటున్నారు. హోంబలే ఫిల్మ్స్(Hombale Films) ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను తెరకెక్కించింది.
Kantara Chapter 1 | పీక్స్‌కి అంచనాలు..
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కన్నడ బ్లాక్‌బస్టర్ ‘కాంతార’ కు సీక్వెల్‌గా వస్తున్న కాంతార చాప్టర్–1 (Kantara Chapter 1) థియేట్రికల్ ట్రైలర్ తాజాగా విడుదలైంది. రిషబ్ శెట్టి హీరోగా, దర్శకుడిగా నటించిన ఈ చిత్రం కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్ మాత్రం ఆ అంచనాలకు తగిన స్థాయిలోనే ఉండడంతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. ‘నాన్న ఎందుకు ఇక్కడే మాయమయ్యాడు?’ అనే డైలాగ్‌తో ప్రారంభమయ్యే ట్రైలర్, సన్నివేశాల పరంగా అత్యుత్తమంగా కనిపిస్తోంది. గ్రాండ్ విజువల్స్, సాలిడ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఇంటెన్స్ ఎమోషనల్ టచ్‌తో ఈ ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠ కలిగించేలా సాగింది.
2 నిమిషాల 56 సెకన్లు ట్రైలర్ నిడివి కాగా, నేటివిటీ టచ్‌తో ఆకట్టుకునే స్టైల్ విజువల్స్‌తో ఆకట్టుకుంటుంది. బిజీఎం థ్రిల్ కలిగించేలా ఉండడం విశేషం. కథానాయకుడి వ్యక్తిత్వం, మిస్టరీ, భావోద్వేగాల మేళవింపు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సినిమా తెలుగులో గీతా ఆర్ట్స్ ద్వారా విడుదల కానుండగా, నైజాం ప్రాంతానికి మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) డిస్ట్రిబ్యూషన్ హక్కులు దక్కించుకున్నారు. ‘కాంతార’ మొదటి భాగం సాధించిన విజయం తర్వాత, రెండో భాగంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్లో కనిపించిన ప్రొడక్షన్ వాల్యూస్, కథనశైలి, సాంకేతిక నైపుణ్యం అన్ని కూడా సినిమా పాన్ ఇండియా లెవెల్లో మరో విజయం సాధించబోతోందన్న నమ్మకాన్ని కలిగిస్తోంది. మొత్తం మీద, ‘కాంతార చాప్టర్ 1’ థియేట్రికల్ ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచుతూ, రిషబ్ శెట్టి మరో విజయం ఖాయమనే సంకేతాలను ఇస్తోంది. సినిమా అక్టోబర్ 2న విడుదల కానుంది.