- Advertisement -
Homeతాజావార్తలుNizamabad City | ఫీజుల కోసం కాలేజీ యాజమాన్యం వేధిస్తోంది

Nizamabad City | ఫీజుల కోసం కాలేజీ యాజమాన్యం వేధిస్తోంది

- Advertisement -

అక్షర టుడే, ఇందూరు: Nizamabad City | ఫీజు అధికంగా చెల్లించాలని కళాశాల యాజమాన్యం వేధిస్తుందని ఆర్మూర్ క్షత్రియ కళాశాల (Armoor Kshatriya College) డిప్లొమా విద్యార్థులు వాపోయారు. ఈ మేరకు సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తాము కళాశాలలో మొదటి సంవత్సరంలో అడ్మిషన్ పొందినప్పుడు ఫీజు రీయింబర్స్ మెంట్ (fee reimbursement) రూ.15,780 పోను, కళాశాల ఫీజు రూ. 880 చెల్లించామన్నారు. అయితే ఈ సంవత్సరం ఫీజు రీయింబర్స్ మెంట్, కళాశాల ఫీజు, బిల్డింగ్ డెవలప్ మెంట్ ఫీజు పేరుతో మొత్తం రూ.24 వేలు చెల్లించాలంటూ యాజమాన్యం ఒత్తిడి తెస్తుందన్నారు. పేద విద్యార్థులమైన తాము అంత ఫీజు చెల్లించలేమని వాపోయారు. తమ సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ ను కోరారు. వినతి పత్రం అందించిన వారిలో 50 మంది విద్యార్థులు ఉన్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News