- Advertisement -
Homeతాజావార్తలుSriram Sagar | శ్రీరామ్​సాగర్​కు భారీగా ఇన్​ఫ్లో.. 40 గేట్లు ఓపెన్​

Sriram Sagar | శ్రీరామ్​సాగర్​కు భారీగా ఇన్​ఫ్లో.. 40 గేట్లు ఓపెన్​

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Sriram Sagar | ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయని శ్రీరామ్​ సాగర్​కు (Sriram Sagar) ఎగువ నుంచి భారీగా వరద కొనసాగుతోంది. దీంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.

స్థానికంగా, ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో గోదావరికి (Godavari) వరద పోటెత్తింది. దీంతో ఎస్సారెస్పీలోకి భారీగా ప్రవాహం (heavy flow) వస్తోంది. జలాశయంలోకి ప్రస్తుతం 2,54,995 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తోంది. దీంతో అధికారులు 40 గేట్లు ఎత్తి 2,38,720 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు.

- Advertisement -

 Sriram Sagar | కాలువల ద్వారా..

ప్రాజెక్ట్​ నుంచి వరద కాలువ ద్వారా 6,735 క్యూసెక్కులు, కాకతీయ కాలువకు (Kakatiya canal) 5,500, ఎస్కేప్​ గేట్ల ద్వారా 2,500, సరస్వతి కాలువకు 400, లక్ష్మి కాలువకు 200 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. అలీసాగర్​ ఎత్తిపోతలకు (Alisagar lift irrigation) 180 క్యూసెక్కులు, మిషన్​ భగీరథకు 231, ఆవిరి రూపంలో 709 క్యూసెక్కులు పోతుంది. మొత్తం ఔట్​ ఫ్లో 2,54,995 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్ట్​ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 80.053 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

 Sriram Sagar | కొనసాగుతున్న విద్యుత్​ ఉత్పత్తి

ప్రాజెక్ట్​ నుంచి ఎస్కేప్​గేట్లు, కాకతీయ కాలువ ద్వారా నీటి విడుదల కొనసాగుతుండటంతో జెన్​ కో అధికారులు జల విద్యుత్​ కేంద్రంలో ఉత్పత్తి చేపడుతున్నారు. నాలుగు టర్బయిన్ల ద్వారా నిత్యం కరెంట్​ ఉత్పత్తి చేస్తున్నారు.

 Sriram Sagar | పర్యాటకుల సందడి

శ్రీరాంసాగర్​ 40 గేట్లు ఎత్తడంతో గోదావరి కిందకు పరవళ్లు తొక్కుతోంది. దీంతో జలసవ్వడులు తిలకించేందుకు పర్యాటకులు భారీగా తరలి వస్తున్నారు. ఆదివారం ఎస్సారెస్పీకి (SRSP) భారీగా ప్రజలు వచ్చారు. దసరా సెలవులు కావడంతో ప్రాజెక్ట్​ అందాలను తిలకించడానికి నిత్యం వేలాది వస్తారని అధికారులు భావిస్తున్నారు. అయితే ఎవరిని కూడా గేట్ల వైపు అనుమతించడం లేదు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News