- Advertisement -
Homeబిజినెస్​Stock Market | కోలుకున్న మార్కెట్లు.. స్వల్ప నష్టాల్లో సూచీలు

Stock Market | కోలుకున్న మార్కెట్లు.. స్వల్ప నష్టాల్లో సూచీలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | కొత్త హెచ్‌-1 బీ వీసాల ఫీజు పెంచుతూ యూఎస్‌ అధ్యక్షుడు ట్రంప్‌(US president Trump) తీసుకున్న నిర్ణయంతో ఐటీ కంపెనీలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయి. దీంతో ప్రధాన సూచీలు నూతన వారాన్ని భారీ నష్టాలతో ప్రారంభించాయి. అయితే కనిష్టాల వద్ద లభించిన మద్దతుతో సూచీలు కోలుకుంటున్నారు.

సోమవారం ఉదయం సెన్సెక్స్‌ 475 పాయింట్లు, నిఫ్టీ(Nifty) 89 పాయింట్ల నష్టంతో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత కోలుకుని పైకి లేచాయి. సెన్సెక్స్‌ 82,151 నుంచి 82,583 పాయింట్ల మధ్యలో, నిఫ్టీ 25,211 నుంచి 25,331 పాయింట్ల మధ్యలో కదలాడుతున్నాయి. ఉదయం 11.10 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌(Sensex) 180 పాయింట్ల నష్టంతో 82,445 వద్ద, నిఫ్టీ 32 పాయింట్ల నష్టంతో 25,294 వద్ద ఉన్నాయి.

- Advertisement -

ఐటీలో సెల్లాఫ్‌..

ఐటీ స్టాక్స్‌ సెల్లాఫ్‌కు గురవుతుండగా.. యుటిలిటీ(Utility), పవర్‌, ఇన్‌ఫ్రా స్టాక్స్‌ రాణిస్తున్నాయి. బీఎస్‌ఈలో యుటిలిటీ ఇండెక్స్‌ 2.31 శాతం, పవర్‌ 1.89 శాతం, ఇన్‌ఫ్రా 1.01 శాతం, రియాలిటీ 0.94 శాతం, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ 0.68 శాతం, క్యాపిటల్‌ మార్కెట్‌ 0.62 శాతం పెరిగాయి. ఐటీ ఇండెక్స్‌(IT index) 2.78 శాతం పడిపోగా.. హెల్త్‌కేర్‌ 0.42 శాతం, టెలికాం 0.29 శాతం నష్టంతో ఉన్నాయి. లార్జ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 0.10 శాతం లాభంతో ఉండగా.. మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.12 శాతం, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.03 శాతం నష్టంతో కొనసాగుతున్నాయి.

Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 18 కంపెనీలు లాభాలతో ఉండగా.. 12 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి. అదాని పోర్ట్స్‌ 1.93 శాతం, బజాజ్‌ ఫైనాన్స్‌ 1.36 శాతం, ఎటర్నల్‌ 1.04 శాతం, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ 0.90 శాతం, యాక్సిస్‌ బ్యాంక్‌ 0.57 శాతం లాభాలతో ఉన్నాయి.

Top Losers : టెక్‌ మహీంద్రా 3.77 శాతం, ఇన్ఫోసిస్‌ 2.71 శాతం, టీసీఎస్‌ 2.60 శాతం, హెచ్‌సీఎల్‌ టెక్‌ 2.14 శాతం, బీఈఎల్‌ 0.60 శాతం నష్టంతో కదలాడుతున్నాయి.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News