అక్షరటుడే, వెబ్‌డెస్క్ : RVNL Notifications | మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీ కోసం రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (Rail Vikas Nigam Limited) నోటిఫికేషన్ జారీ చేసింది. రెగ్యులర్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. నోటిఫికేషన్(Notification) వివరాలిలా ఉన్నాయి.
భర్తీ చేసే పోస్టుల సంఖ్య : 17.
పోస్టు పేరు, ఖాళీలు..
సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ (సివిల్) – 06.
మేనేజర్ (సివిల్) – 06.
డిప్యూటీ మేనేజర్ (సివిల్) – 02.
అసిస్టెంట్ మేనేజర్ (సివిల్) – 03.
విద్యార్హత : 60 శాతం మార్కులతో డిప్లొమా(Diploma), బీఈ/బీటెక్ సివిల్ ఇంజినీరింగ్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పని అనుభవం అవసరం.
వయోపరిమితి :
సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ : 48 ఏళ్లలోపు వారు అర్హులు.
మేనేజర్ : 40 ఏళ్లలోపు..
డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ : 35 ఏళ్లలోపు..
వేతన శ్రేణి..
సీనియర్ జనరల్ మేనేజర్ : రూ. 80 వేలు – రూ. 2.20 లక్షలు (అదనపు అలవెన్స్‌లూ లభిస్తాయి)
మేనేజర్ : రూ. 50 వేలు – రూ. 1.60 లక్షలు (అదనపు అలవెన్స్‌లూ లభిస్తాయి)
డిప్యూటీ మేనేజర్ : రూ. 40 వేలు – రూ. 1.40 లక్షలు (అదనపు అలవెన్స్‌లూ లభిస్తాయి)
అసిస్టెంట్ మేనేజర్ : రూ. 30 వేలు – రూ. 1.20 లక్షలు (అదనపు అలవెన్స్‌లూ లభిస్తాయి)
దరఖాస్తు గడువు : అక్టోబర్ 16.
దరఖాస్తు రుసుము : యూఆర్, ఓబీసీ అభ్యర్థులు రూ. 400 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌లకు ఫీజు లేదు.
సీనియర్ డీజీఎం(Sr. DGM) పోస్టులకు దరఖాస్తు ఫీజు లేదు.
దరఖాస్తు విధానం : ఆఫ్‌లైన్ ద్వారా.. దరఖాస్తుదారులు తమ దరఖాస్తులను డిస్పాచ్ సెక్షన్, గ్రౌండ్ ఫ్లోర్, ఆగస్ట్ క్రాంతి భవన్, బికాజీ కామా, ఆర్‌కే పురం, New Delhi చిరునామాకు పంపించాలి.
ఎంపిక విధానం : రాత పరీక్ష / ఇంటర్వ్యూ ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తారు. ఎంపికైనవారు దేశంలో ఎక్కడైనా పనిచేయాల్సి ఉంటుంది.
పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్ https://rvnl.org/job లో సంప్రదించగలరు.