అక్షరటుడే, వెబ్‌డెస్క్: OG Event | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) నటిస్తున్న భారీ చిత్రం ‘ఓజీ’ కన్సర్ట్ ఈవెంట్ సెప్టెంబర్ 21న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో గ్రాండ్‌గా జరిగింది. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు సుజిత్ దర్శకత్వం వహిస్తుండగా, తమన్ (Thaman) సంగీతం అందిస్తున్నారు.
బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ (Bollywood actor Emraan Hashmi) విలన్‌గా, ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా నటిస్తున్నారు. చిత్ర రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మూవీ టీం ఎల్బీ స్టేడియంలో భారీగా మ్యూజికల్ కన్సర్ట్ ప్లాన్ చేసింది. అయితే ఈ ఈవెంట్‌కు వర్షం ఆటంకం కలిగించినప్పటికీ, పవన్ కళ్యాణ్ ఎంట్రీతో స్టేడియం ఒక్కసారిగా హోరెత్తింది. కత్తితో స్టేజిపైకి వచ్చిన పవన్ బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ లో మాస్ ఎఫెక్ట్ చూపించారు.
OG Event | ఎంట్రీ అదిరింది..
వర్షం కారణంగా ఈవెంట్ కొంత ముందుగానే ముగించినా, అభిమానులు ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. “వర్షం మనల్ని ఆపలేదు. ఓటమి మనల్ని ఆపలేదు” అంటూ పవన్ ఇచ్చిన పవర్ఫుల్ స్పీచ్ అభిమానులను ఉర్రూతలూగించింది. సినిమాలో మాదిరిగానే వర్షంలో అలా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కత్తి పట్టుకొని నడిచొస్తుండడం చూసి ఫ్యాన్స్ పిచ్చెక్కిపోయారు.
ఇదేమి ఎలివేషన్రా బాబోయ్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కార్యక్రమంలో పవన్ మాట్లాడుతూ, “ఈ సినిమా చేయడంలో నా పాత్ర ఒక్కటే కాదు.. సుజిత్, తమన్ ఇద్దరూ కసిగా పని చేశారు. వాళ్లే అసలు స్టార్లు” అని తెలిపారు. సుజిత్ గురించి మాట్లాడుతూ, ఇతను కథ చెప్పడం తక్కువ, చేసేదే ఎక్కువ. నేను సినిమా చేస్తున్నప్పుడు డిప్యూటీ సీఎం అని కూడా మర్చిపోయాను. ఓ డిప్యూటీ సీఎం ఇలా కత్తిపట్టుకొని వస్తే ఊరుకుంటారా?” అంటూ జోక్ వేశారు.
పవన్ స్పీచ్‌లో హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ గురించి మాట్లాడుతూ, ఆమె అద్భుతంగా నటించిందని, హీరో-హీరోయిన్ మధ్య లవ్ స్టోరీను హృద్యంగా చూపించారని పేర్కొన్నారు. అలాగే శ్రియ రెడ్డి గురించి మాట్లాడుతూ, “ఆడ సివంగి, ఆమె పంచ్ పవర్ చాలా ఎక్కువ” అన్నారు.ఇక ఈవెంట్ ప్రారంభంలో యాంకర్‌గా సుమ కనకాల (Suma Kanakala) దుమ్ములేపగా, సంగీత దర్శకుడు తమన్ కూడా వర్షాన్ని లెక్క చేయకుండా “వర్షమా.. బొక్క.. మనల్నెవర్రా ఆపేది?” అంటూ పూనకాలు తెప్పించారు.
డైరెక్టర్ సుజిత్ (Director Sujith), “ఫైర్ స్టోర్మ్ వస్తుందనుకున్నాం, కానిరెయిన్ స్టోర్మ్ వచ్చింది” అంటూ హ్యూమరస్‌గా మాట్లాడారు. ఈవెంట్లో పవన్ కళ్యాణ్ ఓ పాటను స్వయంగా పాడుతూ, “ఓషి..యా ఓషి.. గాలిలో ఎగిరే నిన్ను ఎలా నేలకు దించాలో నాకు తెలుసు..” అంటూ అభిమానులను అలరించారు.ఈ ఈవెంట్ ద్వారా పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఓజీ’ సినిమాపై (OG Movie) అంచనాలు మరింత పెరిగాయి.