అక్షరటుడే, హైదరాబాద్: Sai Pallavi Bikini Pics | టాలీవుడ్ Tollywood లో నేచురల్ బ్యూటీ natural beauty గా గుర్తింపు పొందిన సాయి పల్లవి Sai Pallavi తాజాగా ఓ బోల్డ్ లుక్‌తో వార్తల్లోకెక్కింది.
ఇప్పటివరకు పద్ధతిగా, గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ సంప్రదాయబద్ధ నటిగా పేరొందిన ఆమె, తాజాగా బికినీ డ్రెస్‌లో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం విదేశాల్లో సాయిపల్లవి తన చెల్లెలు పూజా కన్నన్‌తో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. అక్కడ బీచ్ సందర్శనలో భాగంగా జలక్రీడల్ని ఆస్వాదించిన క్షణాలను కెమెరాల్లో బంధించగా, ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చకు దారి తీశాయి.
ఇప్పటి వరకూ సంప్రదాయ దుస్తులు, సాదాసీదా పాత్రల వైపే మొగ్గుచూపిన సాయిపల్లవిని ఇలా సడెన్‌గా బికినీలో చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
Sai Pallavi Bikini Pics | తొలిసారి ఇలా..
ఇదేంటి సాయి పల్లవి బికినీలోనా? నమ్మశక్యంగా లేదు!”.. “ఇప్పటివరకు నేచురల్ లుక్స్‌లో మాత్రమే మెరిసిన ఆమె ఇలా బోల్డ్ అవతారంలో కనిపించడం షాకింగ్” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఈ ఫోటోలు పర్సనల్ వెకేషన్ సమయంలో తీసినవని తెలుస్తోంది. ఆమె చెల్లెలు పూజా కన్నన్ పెళ్లి తరువాత విదేశాల్లో సెటిలయ్యారు. ఇటీవల ఆమెను కలవడానికి వెళ్ళిన సాయి పల్లవి.. కుటుంబసభ్యులతో కలిసి సముద్రతీరంలో ఎంజాయ్ చేస్తూ బికినీలో Bikini కనిపించింది.
ఈ క్రమంలో కొంతమంది అభిమానులు సాయిపల్లవికి మద్దతుగా నిలుస్తున్నారు. వెకేషన్‌లో బికినీ వేసుకోవడంలో తప్పేముంది?.. ఇది ఆమె వ్యక్తిగత జీవితం.. ఆమె ఇష్టమొచ్చినట్టుగా తిరగకూడదా?” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం సాయి పల్లవి, హిందీలో తెరకెక్కుతోన్న భారీ ప్రాజెక్ట్ ‘రామాయణ’ Ramayana లో సీతాదేవిగా నటిస్తోంది. ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ Ranbir Kapoor రాముడిగా నటిస్తున్నాడు.
దాదాపు రూ. 4000 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కనుంది. ఈ నేపథ్యంలో ఈ బికినీ ఫొటోలు లీకవడం, అభిమానుల్లో మిశ్రమ భావోద్వేగాలు కలిగిస్తున్నాయి.
ఇది ఆమె వ్యక్తిగత జీవితం. ఓ నటి వెకేషన్‌లో తన సౌకర్యానికి అనుగుణంగా డ్రెస్ వేసుకోవడం, ఎంజాయ్ చేయడం తప్పేమీ కాదు.
అయితే, ప్రముఖుల జీవితాల్ని పబ్లిక్ ప్రాపర్టీగా భావించకూడదు అనే అంశాన్ని ఈ సందర్భంగా గుర్తించాల్సి ఉంటుంది.