- Advertisement -
HomeతెలంగాణWeather Updates | తెలంగాణకు నేడు వర్ష సూచన

Weather Updates | తెలంగాణకు నేడు వర్ష సూచన

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సోమవారం వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు (Heavy Rains) పడుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి సమయంలో వాన పడే ఛాన్స్​ ఉంది. ఉదయం నుంచి ఉక్కపోతగా ఉంటుంది. హైదరాబాద్​ (Hyderabad) నగరంలో మధ్యాహ్నం వరకు వాతావరణం పొడిగా ఉంటుంది. సాయంత్రం, రాత్రి పూట అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి.

- Advertisement -

Weather Updates | దంచికొట్టిన వాన

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం వర్షం దంచి కొట్టింది. హైదరాబాద్​ నగరంలోని పలు చోట్ల కుండపోత వాన కురిసింది. దీంతో రోడ్లు జలమయం అయి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. భువనగిరి, జనగామ, నల్గొండ, సిద్దిపేట, మెదక్​, సంగారెడ్డి, మేడ్చల్​, వికారాబాద్​, మహబూబ్​నగర్​ జిల్లాల్లో సైతం వాన పడింది.

Weather Updates | వర్షపాతం వివరాలు

భువనగిరి జిల్లా ఆత్మకూర్​లో ఆదివారం ఉదయం 8:30 గంటల నుంచి సోమవారం ఉదయం 7 గంటలకు వరకు అత్యధికంగా 126.8 మి.మీ. వర్షం కురిసింది. జనగామ జిల్లా దేవరుప్పలలో 122.8, నారాయణపేట జిల్లా మొగలమడ్కలో 109.5, మెదక్​ జిల్లా అల్లాదుర్గంలో 104.3, భువనగిరి జిల్లా దత్తప్పగూడలో 101.5, వికారాబాద్​ జిల్లా ముజాహిద్​పూర్​లో 100.5 మి.మీ. వర్షపాతం నమోదు అయింది.

Weather Updates | నదులకు భారీ వరద

వారం రోజులుగా తెలంగాణతో పాటు మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో నదులకు భారీగా వరద వస్తోంది. ప్రధాన నదులైన గోదావరి (Godavari), కృష్ణ (Krishna) ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మంజీర నదికి సైతం భారీగా వరద పోటెత్తింది. దీంతో ఆయా నదులపై గల ప్రాజెక్టుల గేట్లు ఎత్తి అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News