అక్షరటుడే, వెబ్‌డెస్క్: IND vs PAK | ఆసియా కప్ 2025 Asia Cup 2025 సూపర్-4లో టీమిండియా విజృంభిస్తోంది. ఆదివారం జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్‌లో భారత్ మరోసారి పాకిస్థాన్‌ను చిత్తు చేసింది.
6 వికెట్ల తేడాతో గెలిచిన భారత్ టోర్నీలో వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 171 పరుగులు చేసింది.
సహిబ్జాద ఫర్హాన్ (58), ఫహీమ్ అష్రఫ్ (20 నాటౌట్) రాణించారు. భారత బౌలర్లలో శివమ్ దూబే 2 వికెట్లు తీయగా, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ పడగొట్టారు.
అయితే, ఫీల్డర్లు నాలుగు క్యాచ్‌లు వదిలేయడం వల్ల పాకిస్థాన్ పెద్ద స్కోరు సాధించగలిగింది. లేకపోతే ఈ మాత్రం స్కోరు కూడా చేసేది కాదు.
IND vs PAK | నో షేక్ హ్యాండ్ వివాదం..
172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా పవర్‌ప్లే నుంచే దూకుడు ప్రదర్శించింది. తొలి బంతినే సిక్స్‌తో ప్రారంభించిన అభిషేక్ శర్మ పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
కేవలం 24 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసి, మొత్తంగా 39 బంతుల్లో 74 (6 ఫోర్లు, 5 సిక్స్‌లు) బాదాడు. అతనికి తోడుగా శుభ్‌మన్ గిల్ (47), తిలక్ వర్మ Tilak Varma (30 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు.
భారత్ 18.5 ఓవర్లలో 174/4 చేసి, 7 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్‌ను ముగించింది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే అభిషేక్–గిల్ జంట పాక్ బౌలర్లను చితక్కొట్టింది.
ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 105 పరుగులు జోడించారు. గిల్ హాఫ్ సెంచరీకి చేరువలో ఫహీమ్ అష్రఫ్ బౌలింగ్‌కు బలయ్యాడు.
తర్వాత అభిషేక్‌ను అబ్రర్ అహ్మద్ పెవిలియన్ పంపాడు. అయినా తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా జంట విజయాన్ని ఖాయం చేశారు.
విజయం అనంతరం భారత్ ఆటగాళ్లు నేరుగా డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లిపోయారు. మరోసారి పాక్ Pakistan ఆటగాళ్లతో హ్యాండ్ షేక్ చేయకపోవడం చర్చనీయాంశమైంది.
ఈ ఘటనపై సోషల్ మీడియాలో విభిన్న స్పందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విజయంతో టీమిండియా ఆసియా కప్ 2025లో ఫైనల్ దిశగా దూసుకెళ్తోంది.
అభిమానులంతా అభిషేక్ శర్మపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. భారత్ తమ తదుపరి మ్యాచ్‌లలో బంగ్లాదేశ్, శ్రీలంక జట్లతో తలపడనుంది. వీటిలో ఒకటి గెలిచినా ఫైనల్‌కి దగ్గరవుతుంది.
[…] IND vs PAK | మళ్లీ నో షేక్ హ్యాండ్.. మ్యాచ్‌ల… […]