అక్షరటుడే, హైదరాబాద్: IND vs PAK | ఆసియా కప్ – 2025 (Asia Cup – 2025) సూపర్ 4 (Super 4) లో భాగంగా దుబాయ్ (Dubai) లో భారత్ – పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది.
టాస్ గెలిచిన భారత్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో మొదట బ్యాటింగ్ చేపట్టిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేయగలిగింది.
IND vs PAK | ఏడు బంతులు ఉండగానే..
పాకిస్తాన్ ఆటగాళ్లు విధించిన 172 పరుగుల లక్ష్యాన్ని నాలుగు వికెట్లు కోల్పోయి, ఏడు బంతులు ఉండగానే ఛేదించింది.
ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ (Sahibzada Farhan) 58 పరుగులు చేశాడు. మహ్మద్ నవాజ్, సైమ్ అయూబ్ చెరో 21 పరుగులు తీశారు.
భారత్ తరఫున శివమ్ దుబే (Shivam Dubey) రెండు వికెట్లు తీసుకున్నాడు. కుల్దీప్ యాదవ్, ర్దిక్ పాండ్యా ఒక్కో వికెట్ పడగొట్టాడు.