అక్షరటుడే, వెబ్‌డెస్క్: Farhan gun firing celebration | ఆసియా కప్ 2025 (Asia Cup 2025) సూపర్ 4 (Super 4) లో భాగంగా ఆదివారం (సెప్టెంబరు 21) భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత్ ఆటగాళ్లు ఘన విజయం సాధించారు.
కాగా, ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ బ్యాట్స్‌మన్ ‘గన్ ఫైరింగ్’ gun firing చేస్తున్నట్టుగా బ్యాట్‌తో స్టిల్ ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. దీనిపై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పహల్గావ్ ఉగ్రదాడి తర్వాత దాయాది పాకిస్తాన్‌తో భారత్ మ్యాచ్ ఆడటాన్ని చాలా మంది వ్యతిరేకించారు. ఇందుకు సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానం Supreme Court వరకు సైతం వెళ్లింది.
కాగా, ఆసియా కప్‌లో భాగంగా ఇటీవల లీగ్ దశలో భారత్ – పాకిస్తాన్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో పహల్గావ్ ఉగ్రదాడికి నిరసనగా భారత ఆటగాళ్లు పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేయడానికి ఇష్టపడలేదు.
Farhan gun firing celebration |
ఈ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ఇక తాజాగా సూపర్ 4 లో మరోమారు భారత్ – పాక్ లు తలపడ్డాయి. ఈ పోరులోనూ భారత్ గెలిచింది.
టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకోవడంతో పాక్ బ్యాటింగ్ చేపట్టింది. పాకిస్తాన్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.
సగం సెంచరీ పూర్తికాగనే.. ఇతగాడు బ్యాట్‌తో ‘గన్ – ఫైరింగ్’ స్టైల్లో సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఈ పరిణామంపై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అతగాడు భారత్ డగౌట్ వైపు చూస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడని మండిపడుతున్నారు. ‘‘పహల్గావ్లో అమాయక పర్యాటకులను అతగాడి సోదరులు ఎలా చంపారో ఫర్హాన్ అర్ధ సెంచరీ వేడుక ద్వారా చూపించాడు.’’ అని ఓ నెటిజన్ ఘాటుగా విమర్శించాడు.