- Advertisement -
HomeతెలంగాణSubbiramiReddy loan waiver | సుబ్బిరామిరెడ్డి ఫ్యామిలీకి రూ. 5700 కోట్ల రుణమాఫీ !

SubbiramiReddy loan waiver | సుబ్బిరామిరెడ్డి ఫ్యామిలీకి రూ. 5700 కోట్ల రుణమాఫీ !

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్​: SubbiramiReddy loan waiver | కాంగ్రెస్ లీడర్ Congress leader, ఆ పార్టీ వర్కింగ్ కమిటీ శాశ్వత ఆహ్వానితుడు, మాజీ ఎంపీ సుబ్బిరామిరెడ్డి గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో Telugu states తెలియనివారు ఉండరు.

కామారెడ్డిలోని గాయత్రి చక్కెర కర్మారాగం Gayatri Sugar Factory యజమానిగా కూడా అందరికీ సుపరిచితుడే. అతిపెద్ద గుత్తేదారు contractor కూడా. ఎన్నో కాంట్రాక్టు పనులు చేపట్టారు. లగ్జరీ జీవితం గడిపే మిలియనీర్​ కుటుంబం వారిది.

- Advertisement -

అలాంటి కోట్లాది రూపాయల ఆస్తి ఉన్న సుబ్బిరామిరెడ్డి కుటుంబానికి బ్యాంకులు రుణమాఫీ చేస్తున్నాయి.. సామాన్యులు కలలో కూడా ఊహించనంత అంటే రూ.5,700 కోట్ల రుణమాఫీకి సిద్ధమయ్యాయి.

సామాన్య ప్రజలు రూ. లక్ష రుణం తీసుకున్నా.. ముక్కు పిండి వసూలు చేసే బ్యాంకర్లు.. మిలియనీర్లకు మాత్రం రుణమాఫీ చేస్తూ బ్యాంకులను దివాళా తీయిస్తున్నారు.

SubbiramiReddy loan waiver | రూ.వేల కోట్ల ఎగవేత..

ఇక విషయానికి వస్తే.. సుబ్బిరామిరెడ్డి ఫ్యామిలీ ఆయా బ్యాంకుల్లో రూ. వేల కోట్లు అప్పుగా తీసుకున్నాయి. కానీ, వాటిని తిరిగి చెల్లించలేదు.

తీసుకున్న రుణాలు చెల్లించాలని ఈ మిలియనీర్​ ఫ్యామిలీ చుట్టూ బ్యాంకర్లు తిరిగి విసిగి వేసారిపోయారు.  చివరికి బ్యాంకర్లు గాయత్రి ప్రాజెక్ట్స్ ను వేలం వేయాలని నిర్ణయించారు.

ఇందుకు సుబ్బిరామిరెడ్డి ఫ్యామిలీ అడ్డు చెప్పలేదు. ఏమైనా చేసుకోమని వదిలేశారు. దీంతో బ్యాంకర్లు ఎన్సీఎల్టీ NCLT లో పిటిషన్లు వేసి.. కంపెనీ వేలం చేపట్టారు.

కానీ, దానిని కొనుగోలు చేసేందుకు ఒక్కరు కూడా ముందుకు రాలేదట. చివరికి బ్యాంకర్లు విసిగిపోయారట. సుబ్బిరామిరెడ్డి ఫ్యామిలీకే బంపర్​ ఆఫర్​ ఇచ్చారు.

మొత్తం కట్టాల్సిన రూ. 8100 కోట్లలో వన్ టైమ్ సెటిల్మెంట్​కు అవకాశం కల్పించారు. రూ. 2400 కోట్లు కట్టి కంపెనీని సుబ్బిరామిరెడ్డి కుటుంబానికే ఉంచేసుకోమని చెప్పేశారట.

అంటే మిగతా రూ. 5,700 కోట్లు మాఫీ చేస్తాయన్నాయట. ఇంకేం దీనికి ఆ కుటుంబం చంకలు గుద్దుకుంటూ సంబరంగా అంగీకరించాయట.

అంటే ఇప్పుడు రూ. 2400 కోట్లు కట్టేస్తే.. గాయత్రీ ప్రాజెక్ట్స్ పేరిట మళ్లీ రూ. వేలాది కోట్లు అప్పులు చేసేందుకు అర్హత పొందుతారన్నమాట.

మళ్లీ కాంట్రాక్టుల పేరుతో వేల కోట్లు అప్పులు చేయడానికి అర్హత సాధిస్తుంది. అంటే మళ్లీ అప్పులు చేసి, ఇలా మళ్లీ ఎగ్గొట్టేసేందుకు బ్యాంకర్లు రెడ్​ కార్పెట్​ పరిచారు ఆ మిలియనీర్​ కుటుంబానికి. మొత్తానికి ఆ ఫ్యామిలీ రూ.5,700 కోట్లను బ్యాంకర్లకు ఎగ్గొట్టినట్లే కదా..

- Advertisement -
- Advertisement -
Must Read
Related News