ePaper
More
    HomeతెలంగాణPolice Vehicles | ఏంటి.. పోలీస్ వాహనాలపై రూ.68.67 లక్షల చలానాలా.. వారు క‌ట్టరా?

    Police Vehicles | ఏంటి.. పోలీస్ వాహనాలపై రూ.68.67 లక్షల చలానాలా.. వారు క‌ట్టరా?

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Police Vehicles |బండి లేదా కారులో రోడ్డు మీద వెళుతున్నామంటే భ‌య‌ప‌డాల్సి వ‌స్తుంది. ఎక్క‌డా ఏ ట్రాఫిక్ పోలీస్(Traffic Police) ఆపుతాడో అని. అన్ని స‌రిగా ఉన్నా కూడా ఏదో ఒకటి చెప్పి చ‌లానాలు విధిస్తున్నారంటూ వాహ‌నదారులు వాపోతున్నారు. కొంద‌రు చ‌లాన్లు(Challans) క‌ట్ట‌లేక బ‌స్సుల‌లో ప్ర‌యాణిస్తున్న ప‌రిస్థితి. ఈ మ‌ధ్య ట్రాఫిక్ రూల్స్ Traffic Rules మ‌రింత స్ట్రిక్ట్ కావ‌డంతో వాహ‌న‌దారుల‌లో గుబులు రేగుతుంది. అయితే సాధార‌ణంగా కొంద‌రు వాహ‌న‌దారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించ‌క‌పోవ‌డంతో వారిపై చ‌లాన్ల కొర‌డా ఝుళిపిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు.

    Police Vehicles | ఇంత దారుణ‌మా?

    అయితే ప్రజలపై చలాన్ల కొరడా ఝుళిపించే పోలీసుల్లో కొందరు ఆ నిబంధనలు తమకు పట్టవన్నట్లు వ్యవహరిస్తున్నారు..తెలంగాణ రాష్ట్రంలోని పోలీస్ వాహనాలపై Police Vehicles ఇప్పటివరకు 17,391 ట్రాఫిక్ ఉల్లంఘనల కేసులు నమోదు కాగా, వీటికి గాను మొత్తం రూ.68.67 లక్షల చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయని ఆర్టీఐ(RTI) ద్వారా వెల్లడైంది. ఓ సామాన్య పౌరుడు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేయడంతో ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి. ట్రాఫిక్ నిబంధనలు(Traffic Rules) అన్నీ అందరికీ సమానంగా ఉండాలి అనే భావన ఉన్నప్పటికీ, కొన్ని పోలీస్ వాహనాలు సిగ్నల్ దాటడం, ఓవర్ స్పీడ్, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం వంటి ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్టు న‌మోదు కావ‌డంతో వారిపై ప్ర‌జ‌లు గుర్రుగా ఉన్నారు.

    ప్రజలపై చట్టాన్ని కఠినంగా అమలు చేస్తూ ఉండే పోలీసులు(Police) తమపై మాత్రం మినహాయింపులు అనుకోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. పోలీసులు ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సినవారంటూ పలువురు అభిప్రాయపడ్డారు. ఇలాంటి సందర్భాల్లో చట్టం ముందు అందరూ సమానమనే సూత్రాన్ని ప్రామాణికంగా పాటించాల్సిన అవసరం ఎంతైన ఉంది. పెండింగ్‌లో ఉన్న చలాన్లను(Challans) వెంటనే చెల్లించడమే కాకుండా, భవిష్యత్తులో పోలీసులు Polices కూడా ట్రాఫిక్ నిబంధనలను గౌరవించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్ప‌టి నుండి అయిన ప్రభుత్వ స్థాయి నుంచి పోలీస్ వాహనాలపై మానిటరింగ్ పెంచాలని డిమాండు చేస్తున్నారు.

    More like this

    Kaloji Jayanthi | పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కాళోజీ జయంతి వేడుకలు

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Kaloji Jayanthi | నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో కాళోజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు....

    Formula E Race Case | ఫార్మూలా ఈ రేసులో భారీగా అవినీతి.. ఏసీబీ సంచలన నివేదిక

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Formula E Race Case | రాష్ట్రంలో స్థానిక ఎన్నికల (Local Body Elections)...

    Nizamabad City | జెండాగల్లిలో పేకాట..

    అక్షర టుడే, వెబ్ డెస్క్: Nizamabad City | నగరంలోని జెండాగల్లిలో పేకాట స్థావరంపై నాలుగో టౌన్ పోలీసులు...