- Advertisement -
HomeతెలంగాణTelangana Police | పోలీస్​ వాహనాల స్టిక్కర్ల కోసం రూ.1.60 కోట్లు ఖర్చు

Telangana Police | పోలీస్​ వాహనాల స్టిక్కర్ల కోసం రూ.1.60 కోట్లు ఖర్చు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana Police | హైదరాబాద్ (Hyderabad)​ నగర పోలీస్​ వాహనాలపై స్టిక్కర్లను అధికారులు మారుస్తున్నారు.

బీఆర్​ఎస్​ (BRS) హయాంలో పోలీస్​ వాహనాలపై తెలంగాణ స్టేట్​ పోలీస్​ అని ఉండేది. ప్రస్తుతం తెలంగాణ పోలీస్​ అనే స్టిక్కర్లను అతికించారు. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక టీఎస్ (TS)​ బదులు టీజీ (TG) అని వాడాలని ఆదేశాలు జారీ చేసింది. వాహనాల నంబర్​ ప్లేట్లపై కూడా గతంలో టీఎస్​ అని ఉండగా.. ఇప్పుడు టీజీ వస్తుంది. బీఆర్​ఎస్​ హయాంలో టీఎస్​ అంటే తెలంగాణ స్టేట్​ అని పేర్కొన్నారు. అయితే టీఎస్​ అని పెట్టడంపై గతంలో విమర్శలు వచ్చాయి. టీఆర్​ఎస్​ను సూచించే విధంగా టీఎస్​ అని పెట్టారని పలువురు ఆరోపించారు. ఈ క్రమంలో కాంగ్రెస్​  అధికారంలోకి రావడంతో సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy ) టీజీ అనే ఉండాలని ఆదేశించారు. ఈ మేరకు పోలీస్​ వాహనాల స్టిక్కర్లను సైతం మారుస్తున్నారు.

- Advertisement -

Telangana Police | 188 వాహనాల కోసం..

హైదరాబాద్​ సిటీ పోలీసుల (City Police) పరిధిలో మొత్తం 188 వాహనాలకు కొత్త స్టిక్కర్లు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం పోలీసులు ఇన్నోవా కార్లను వినియోగిస్తున్న విషయం తెలిసిందే. వాటికి కొత్త స్టిక్కర్లు వేయడంతో పాటు పాలిషింగ్​, డెంటింగ్​, పెయింటింగ్​ చేయిస్తున్నారు. దీని కోసం ప్రభుత్వం రూ.1.6 కోట్లు కేటాయించింది. తాజాగా కొత్త రూపు సంతరించుకున్న 134 వాహనాలు పెట్రోలింగ్​ సేవల్లో ఆదివారం తిరిగి చేరాయి. టీఎస్​ నుంచి టీజీకి మార్పులో భాగంగా తెలంగాణ పోలీస్​ అనే స్టిక్కర్లను పోలీస్​ వాహనాలకు అతికించారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News