- Advertisement -
HomeతెలంగాణKotagiri | వీడీసీ ఆగడాలను అరికట్టాలి..

Kotagiri | వీడీసీ ఆగడాలను అరికట్టాలి..

- Advertisement -

అక్షర టుడే, కోటగిరి : Kotagiri | ఆర్మూర్‌ ప్రాంతంలో రోజురోజుకు వీడీసీల ఆగడాలు మితిమీరుతున్నాయని తెలంగాణ రాష్ట్ర గీత కార్మిక సంఘం నాయకులు (Geetha Karmika Sangam leaders) ఆరోపించారు. ఈ మేరకు కోటగిరి మండలకేంద్రంలో (Kotagiri Mandal Center) ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర కార్యదర్శి విఠల్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. మూడు రోజుల కిందట ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్‌లో వీడీసీ సభ్యులు గీత కార్మికులపై దాడి చేశారని, వీరి ఆగడాలను అరికట్టాలని డిమాండ్‌ చేశారు.

అంతేగాకుండా కుల వృత్తిదారులపై దాడులు చేసేవారిపై పీడీ యాక్ట్​ అమలు చేయాలన్నారు. కొంతమంది రాజకీయ పెత్తందార్ల అవసరం కోసం కుల వృత్తులను వాడుకుంటున్నారని, భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా అరికట్టాలని కోరారు. ఈ విషయంపై ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్ (Mahesh Kumar Goud), ఎంపీ అర్వింద్‌ (MP Arvind) స్పందించాలన్నారు. కార్యక్రమంలో గీత కార్మిక సంఘం మండల నాయకులు బి వెంకట్‌ గౌడ్, ఎం శ్రీధర్‌ గౌడ్, రాజా గౌడ్, కోటగిరి గీతా కార్మికులు కృష్ణ గౌడ్, ప్రకాష్‌ గౌడ్, సాయికృష్ణ గౌడ్, గంగాప్రసాద్‌ గౌడ్, ఎం సాయికుమార్‌ గౌడ్త దితరులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News