అక్షరటుడే, కోటగిరి : Kotagiri Mandal | మండల కేంద్రంలోని శ్రీ సాయి అయ్యప్ప మందిరంలో (Sri Sai Ayyappa Mandir) ఆదివారం అయ్యప్ప సేవా పరివార్ జోనల్ లెవెల్ సమావేశం నిర్వహించారు.
అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ తెలంగాణ రాష్ట్ర కమిటీ జాతీయ అధ్యక్షుడు అయ్యప్ప దాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అయ్యప్ప సేవలో నడవాల్సిన విషయాలు, గురుస్వాముల బాధ్యతలు, అయ్యప్ప, మణికంఠ, ధర్మశాస్త్ర సంబంధమైన వివరాలను సంఘ సభ్యులకు వివరించారు. సమావేశానికి ఆదిలాబాద్, నిర్మల్, కేరళ, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నుంచి హాజరయ్యారు. ఆలయ ధర్మకర్త పోలా విఠలరావు గుప్తా, తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు గోగినేని హనుమంతరావు, బీర్కూర్ గంగాధర్ గురు స్వామి, రాజా గురుస్వామి, శంకర్ గురుస్వామి, సుబ్రహ్మణ్యస్వామి, బర్ల రమేష్ స్వామి, అంజి బాబు స్వామి, వీరబాబు స్వామి తదితరులు పాల్గొన్నారు.