- Advertisement -
Homeతాజావార్తలుNizamabad City | హెచ్‌సీయూలో ఏబీవీపీ విజయం శుభ సూచకం

Nizamabad City | హెచ్‌సీయూలో ఏబీవీపీ విజయం శుభ సూచకం

- Advertisement -

అక్షర టుడే, ఇందూరు: Nizamabad City | హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో (Hyderabad Central University) ఏబీవీపీ విజయం సాధించడం శుభ సూచకమని జాతీయ కార్యవర్గ సభ్యుడు శివ అన్నారు. ఆదివారం నగరంలోని ఎన్టీఆర్‌ చౌరస్తాలో విజయోత్సవాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో విద్యార్థులు, యువత జాతీయ భావాన్ని కోరుకుంటున్నారని, దానికి ఈ విజయం నాంది అన్నారు. వామపక్ష విద్యార్థి సంఘాలు (student unions), ఎన్‌ఎస్‌యూఐ లాంటి సంఘాల కూటమితో ఏబీవీపీ ఒంటరి పోరాటం చేసి విజయం సాధించిందన్నారు. ఎన్‌ఎస్‌యుఐకి నోటా కంటే తక్కువ ఓట్లు రావడం కాంగ్రెస్‌ రాజకీయాలను తిప్పి కొట్టినట్లు అయిందన్నారు.

- Advertisement -

కమ్యూనిస్టు ప్రొఫెసర్ల మాటలు పక్కకు పెట్టి విద్యార్థులు ఏబీవీపీకి ఘనవిజయం అందించారన్నారు. కార్యక్రమంలో జిల్లా కన్వీనర్‌ బాలకృష్ణ, విభాగ్‌ సోషల్‌ మీడియా కన్వీనర్‌ సునీల్, తెలంగాణ యూనివర్సిటీ కార్యదర్శి సమీర్, కంఠేశ్వర్‌ జోనల్‌ ఇన్‌ఛార్జి దుర్గాదాస్, నాయకులు అశోక్, అనిల్, జగదీష్, అవిలాష్, రాము తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News