- Advertisement -
Homeఫొటోలు & వీడియోలుLeopard vs Crocodile | వేటగాడే బలయ్యాడు! .. నదిలో నీరు తాగుతున్న చిరుతపై...

Leopard vs Crocodile | వేటగాడే బలయ్యాడు! .. నదిలో నీరు తాగుతున్న చిరుతపై మొసలి మెరుపుదాడి.. హార్ట్‌స్టాపింగ్ వీడియో వైరల్!

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: leopard vs crocodile  | అడవి జీవితం అనేది నిమిషానికొక మలుపు తిరుగుతుంది. అక్కడ బలహీనులు కాదు, ఒక్కోసారి బలవంతులు కూడా ప‌ట్టు కోల్పోతారు. తాజాగా ఓ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో (Social Media) వైరల్‌గా మారింది.

అందులో కనిపించిన దృశ్యం చూసినవారు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. వీడియోలో, ఓ చిరుతపులి (Leopard) నది ఒడ్డున ప్రశాంతంగా నీరు తాగుతూ కనిపించింది. చుట్టూ ఎలాంటి అపాయం లేదు అనుకుని, నిర్భయంగా ఉండగా, నీటిలో కాపు కాసిన మొసలి (Crocodile) మెరుపు వేగంతో దాడి చేసింది. చిరుత చాలా జాగ్రత్తగా ఉన్నప్పటికీ, నీటిలో దాక్కున్న‌ మొసలి పట్ల అప్రమత్తంగా ఉండలేకపోయింది. ఒక్కసారిగా నీటిలోంచి మొసలి ఎగబాకి, చిరుత మెడ‌ని పట్టేసింది.

- Advertisement -

leopard vs crocodile | చివరి శ్వాస వరకూ చిరుత పోరాటం

పట్టుబడిన వెంటనే చిరుత తప్పించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించింది. మొసలి పట్టు నుంచి తప్పించుకునేందుకు ఎంతో పోరాడింది. కానీ మొసలి చిరుతను నీటి లోపలికి లాక్కెళ్లి చంపేసింది. కేవలం కొన్ని సెకన్లలోనే చిరుత మొసలికి ఆహారంగా మారింది. ఈ ఉత్కంఠ భరితమైన వీడియోను @suaibansari3131 అనే యూజర్ X (హిందీగా ట్విట్టర్) లో షేర్ చేశాడు. అతి తక్కువ సమయంలోనే 63,000కి పైగా వ్యూస్ సాధించింది. నెటిజన్లు ఈ వీడియోపై గట్టిగానే స్పందిస్తున్నారు:

ప్రకృతిలో (Nature) వేటగాడే బలయ్యాడు!, మొసలుల బలానికి నిదర్శనం ఇది, “ప్రకృతిలో సర్ప్రైజ్ ఎలిమెంట్ అలాంటిది అంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ఒక విషయాన్ని మళ్లీ మ‌ళ్లీ గుర్తు చేసింది. అడవిలో ఎప్పుడూ విజేతే బ్రతుకుతాడు.

నేచర్‌లో బలహీనతకు చోటు లేదు. ఒక్కసారిగా శాంతంగా కనిపించే పరిసరాలు, నిమిషాల్లో మరణముంగిటికి తీసుకెళ్లేలా మారిపోతాయి. ఈ దృశ్యం ప్రకృతిని తేలికగా తీసుకోరాదు అనే గుణపాఠం మాత్రం ఖచ్చితంగా నేర్పుతుంది. ప్రకృతి ప్రేమికులు, వన్యప్రాణి పరిశోధకులు, ఈ వీడియోలోని వాస్తవికత చూసి నివ్వెరపోతున్నారు. ఇది డాక్యుమెంటరీ స్థాయిలో ఉండే విజువల్స్ అని అంటున్నారు. ఇప్పటికీ ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News