అక్షర టుడే, ముప్కాల్: Konda Laxman Bapuji | మండలంలో పద్మశాలి సంఘం రెండో పంథా ఆధ్వర్యంలో ఆదివారం కొండా లక్ష్మణ్ బాపూజీ (Konda Laxman Bapuji) వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం పలువురు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనలో కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ పెంటు గంగాధర్, సంఘ అధ్యక్షుడు లక్ష్మి రాజ్యం, జీవన్, సుదర్శన్, చిన్నయ్య, జిల్లా కార్యదర్శి గురుడు దయానంద్, మాజీ సర్పంచ్ దాసరి నర్సింగ్ దాస్, జ్ఞానేశ్వర్, జోగు నరేందర్, జోగు అనిల్ కుమార్, పెండెం జీవన్, షేర్ల సత్మారావు, గుండారం రమేష్, ఎల్లప్ప, నర్సయ్య, శ్రీనివాస్, గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.
Konda Laxman Bapuji | ఆర్మూర్‌లో
అక్షర టుడే, ఆర్మూర్ : Konda Laxman Bapuji | పట్టణంలోని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి నిర్వహించారు. స్థానిక జిరాయత్ నగర్లో గల కొండా లక్ష్మణ్ బాపూజీ (Konda Laxman Bapuji) చౌరస్తాలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పద్మశాలి సంఘం పట్టణ అధ్యక్షుడు మ్యాక మోహన్‌దాస్, ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనకు బాపూజీ చేసిన సేవలను గుర్తు చేశారు.
కార్యక్రమంలో పీసీసీ మాసీ కార్యదర్శి ఖాందేశ్ శ్రీనివాస్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి దాసరి సునీల్, మండల అధ్యక్షుడు బొడ్డు గంగాధర్, సర్వ సమాజ్ ప్రతినిధి విద్యాసాగర్, మాజీ కౌన్సిలర్ ఖాందేశ్ సంగీత శ్రీనివాస్, రోటరీ క్లబ్ ప్రధాన కార్యదర్శి సత్యం, కోశాధికారి బత్తుల భాస్కర్, ఉపాధ్యక్షుడు కట్కం నరేందర్, కార్యదర్శి నరహరి, తర్ప అధ్యక్షుడు బండి అనంతరావు, చిట్ల యగ్నేష్, రుద్ర రాజేశ్వర్, సుధాకర్, వేముల ప్రకాష్, బండి రాజు, మాజీ కౌన్సిలర్ గుద్దేటి రమేష్, చౌకె లింగం, అందె నాగేశ్వర్ రావు, అంబల్ల తిరుపతి, మర్రి రాజేశ్వర్, ఆడెపు ప్రభాకర్, వివేకానంద్, గణేష్, నూకల శేఖర్, రమణ, నరేందర్, వందేమాతరం యూత్ సభ్యులు గోక శరత్, బోగ గిరీష్, సదువస్తుల విష్ణు, అంగూర్ భాను తేజ, కట్కం ప్రకాష్, అలిశెట్టి రాజారాం, తదితరులు పాల్గొన్నారు.