- Advertisement -
Homeజిల్లాలుహైదరాబాద్Hyderabad | మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం

Hyderabad | మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | హైదరాబాద్​లో హైటెక్​ వ్యభిచారం నిర్వహించే ముఠాలు రెచ్చిపోతున్నాయి. పోలీసులు దాడులు (Police Raids) చేపడుతున్నా దందా కొనసాగిస్తున్నాయి.

నగరంలో ఇటీవల ఓ మహిళ శ్మాశనం (Cremation)లో వ్యభిచారం నిర్వహిస్తూ దొరికిన విషయం తెలిసిందే. తాజాగా మసాజ్​ సెంటర్​ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న వారిని పోలీసులు అరెస్ట్​ చేశారు. ఎస్​ఆర్​ నగర్ (SR Nagar)​లోని బ్యూటీ స్పా సెంటర్​పై సీసీఎస్​ పోలీసులు ఆదివారం దాడులు చేపట్టారు. అందులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఇద్దరు యువతులు, ఒక నిర్వాహకురాలితో పాటు విటుడిని అరెస్టు చేశారు.

- Advertisement -

Hyderabad | విటుడు మాములోడు కాదుగా..

స్పా సెంటర్​లో దొరికిన విటుడి గురించి పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. ఆయన ఓ ఛానెల్​ రిపోర్టర్​గా గుర్తించారు. ఆయన గతంలో నగరంలోని కొన్ని స్పా సెంటర్ల (Spa Centers)కు వెళ్లి.. వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేసినట్లు సమాచారం. ఆయా సెంటర్ల నుంచి సదరు రిపోర్టర్​ రూ.లక్షలు వసూలు చేసినట్లు తెలిసింది. తాజాగా జరిగిన దాడిలో ఆయన పోలీసులకు చిక్కాడు. ఈ స్పా సెంటర్​ ప్రధాన నిర్వాహకురాలు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నగరంలో వ్యభిచారం, డ్రగ్స్​ దందా పెరిగిపోవడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే యువత గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా వ్యభిచారం నిర్వహించే ముఠాలు సైతం రెచ్చిపోతుండంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News