- Advertisement -
Homeతాజావార్తలుOG First Ticket | ఓజీ సినిమా ఫ‌స్ట్ టికెట్ ఏకంగా ల‌క్ష రూపాయ‌లా.. వేలం...

OG First Ticket | ఓజీ సినిమా ఫ‌స్ట్ టికెట్ ఏకంగా ల‌క్ష రూపాయ‌లా.. వేలం పాట‌లో వ‌చ్చిన మొత్తం ఏం చేయ‌నున్నారంటే..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: OG First Ticket | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు (Pawan Kalyan Movies) అభిమానుల్లో ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఆ క్రేజ్‌ను చిత్తూరుకు చెందిన ఓ వీరాభిమాని వినూత్నంగా చాటుకున్నాడు.

పవన్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) కు సంబంధించిన మొదటి టికెట్‌ను ఏకంగా రూ. లక్ష రూపాయలు చెల్లించి కొనుగోలు చేశాడు. ఈ చర్య ఇప్పుడు అభిమానుల్లోనే కాదు, సినీ ఇండ‌స్ట్రీలోనూ చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న థియేటర్ (Theater) యాజమాన్యం గొప్ప నిర్ణయం తీసుకుంది. ఆ అభిమాని చెల్లించిన లక్ష రూపాయల మొత్తాన్ని ఏకంగా గ్రామాల అభివృద్ధి కోసం ఉపయోగించాలని నిర్ణయించింది.

- Advertisement -

OG First Ticket | అంత పెట్టి కొనుగోలు చేశారా..

జనసేన పార్టీ (Janasena Party) కార్యాలయానికి ఆ మొత్తాన్ని విరాళంగా పంపించాలని థియేటర్ యాజమాన్యం వెల్లడించింది. అభిమాని ప్రేమను మంచి పనికి మలచిన ఈ చర్యపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే, పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘ఓజీ’ చిత్రం సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

ఈ సినిమాకు ‘సాహో’ ఫేమ్ సుజీత్ దర్శకత్వం (Sujith Direction) వహిస్తుండగా, ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై భారీ బడ్జెట్‌తో నిర్మించారు.ఈ సినిమాలో పవన్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటించగా, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ పవర్‌ఫుల్ విలన్‌గా కనిపించనున్నారు. అలాగే శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. తమన్ (SS Thaman) అందించిన పాటలు ఇప్పటికే ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తున్నాయి.

ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్‌, ప్రమోషన్స్ చూసిన ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా పవన్ కళ్యాణ్ స్టైల్, మాస్ యాక్షన్, సుజీత్ టేకింగ్ ఇవన్నీ కలిసి ఈ సినిమాను బ్లాక్‌బస్టర్ చేయ‌నున్నాయి. మొత్తానికి చిత్తూరు అభిమాని చేసిన ఈ చ‌ర్య‌, ‘ఓజీ’ OG మూవీ (OG Movie) చుట్టూ ఏర్పడిన క్రేజ్‌కు నిదర్శనంగా నిలుస్తోంది. ఫ్యాన్ ఇజం‌తో పాటు సోషల్ రిస్పాన్సిబిలిటీని కలగలిపిన ఈ ఉదంతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక మ‌రికొద్ది గంట‌ల‌లో ఓజీ ఈవెంట్ ఎల్బీ స్టేడియంలో జ‌ర‌గ‌నుంది. ఈ కార్య‌క్ర‌మం భారీ ఎత్తున ప్లాన్ చేశారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News