అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Minister Anitha | తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఇటీవల వైసీపీ అధినేత జగన్ (YS Jagan) చేసిన వ్యాఖ్యలకు ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత కౌంటర్ ఇచ్చారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు.
అధికారం కోల్పోయిన నాటి నుంచి వైఎస్ జగన్ అసెంబ్లీ (Assembly)కి వెళ్లడం లేదు. ఆయనతో పాటు వైసీపీ నుంచి గెలిచిన మిగతా 10 మంది ఎమ్మెల్యేలు సైతం శాసనసభ సమావేశాలకు హాజరు కావడం లేదు. దీనిపై ఇటీవల వైఎస్ జగన్ స్పందిస్తూ ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామన్నారు. జగన్ వ్యాఖ్యలపై హోం మంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు.
Minister Anitha | ఎమ్మెల్యేగా రావాలి
జగన్‌కు ప్రజలే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని అనిత ఎద్దేవా చేశారు. హోదా ఇచ్చేందుకు కావాల్సిన సీట్లు రాకపోవడంతోనే స్పీకర్ ఇవ్వడం లేదన్నారు. దీనిపై వైఎస్ జగన్ చిన్నపిల్లాడిలా మారాం చేస్తున్నారని ఆమె ఆగ్రం వ్యక్తం చేశారు. పులివెందుల ఎమ్మెల్యే (Pulivendula MLA)గా అసెంబ్లీకి రావాలని ఆయనకు సూచించారు. వైసీపీ హయాంలో చంద్రబాబుకు అవమానం జరిగితే, ఆయన ఒక్కరే వాకౌట్ చేశారనిచ గుర్తు చేశారు. కానీ జగన్ మాత్రం తన ఎమ్మెల్యేలను ఎవరిని సభకు రానివ్వడం లేదన్నారు.
Minister Anitha | లిక్కర్‌స్కామ్ విచారణ సాగుతోంది
ప్రజా సమస్యలను చర్చించడానికి అసెంబ్లీ వేదిక అని అనిత అన్నారు. ప్రతి ఎమ్మెల్యేకు అసెంబ్లీలో మాట్లాడాలని ఉంటుందని చెప్పారు. అయితే జగన్ మాత్రం తమ పార్టీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ వెళ్లే అవకాశం ఇవ్వడం లేదని విమర్శించారు. జగన్ రాకపోతే మిగిలిన ఎమ్మెల్యేలను అయినా అస్లెంబీకి పంపాలని మంత్రి సూచించారు. లిక్కర్ స్కామ్ (Liquor scam)పై ఆమె స్పందిస్తూ విచారణ కొనసాగుతోందన్నారు. నివేదిక వచ్చాక దానిపై స్పందిస్తానని చెప్పారు.