- Advertisement -
Homeజిల్లాలునిజామాబాద్​Sriramsagar | శ్రీరాంసాగర్​ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

Sriramsagar | శ్రీరాంసాగర్​ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

- Advertisement -

అక్షరటుడే, బాల్కొండ​: Sriramsagar | తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్​ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద కొనసాగుతోంది. జిల్లాలో వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ ఎగువన ఉన్న మహారాష్ట్రలో వర్షాలు కురుస్తుండడంతో ప్రాజెక్టుకు భారీ వరద వచ్చి చేరుతోంది.

Sriramsagar | ప్రాజెక్టు 25 గేట్లు ఎత్తి..

వరద పోటెత్తుతుండడంతో ప్రాజెక్టుకు 1,28,000 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తోంది. దీంతో 25 గేట్లు ఎత్తి దిగువకు 1,16,163 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పశువుల కాపరులు, గొర్ల కాపారులు, చేపలు పట్టేవారు, రైతులు, ప్రజలు నది దాటే ప్రయత్నం చేయవద్దని ప్రాజెక్టు ఏఈఈ కొత్తరవి సూచించారు.

- Advertisement -

Sriramsagar | పూర్తిస్థాయిలో ప్రాజెక్టు

ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 1091 అడుగులు (80.5 టీఎంసీలు) కాగా.. 1090.09 అడుగుల (80.05 టీఎంసీ) మేర నీరు నిల్వ ఉంది. దీంతో అధికారులు ఎప్పటికప్పుడు ప్రాజెక్టు నీటిమట్టం ఆధారంగా నీటిని దిగువకు వదులుతున్నారు.

Sri Ramsagar | కాల్వల ద్వారా నీటి విడుదల…

ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో 25 గేట్ల నుంచి దిగువకు నీటిని వదులుతున్నారు. అలాగే కాలువ ద్వారా నీటిసరఫరా కొనసాగుతోంది. వరద కాలువ ద్వారా 6,735 వేల క్యూసెక్కులు, కాకతీయ కాలువ ద్వారా 4,000 క్యూసెక్యులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు వదులుతున్నారు. 709 క్యూసెక్కులు ఆవిరి అవుతోంది. అలాగే సరస్వతి కాలువ నుంచి 400 క్యూసెక్కుల నీరు, లక్ష్మి కాలువ నుంచి 200 క్యూసెక్కులు, అలీసాగర్​ లిఫ్ట్​కు 180 క్యూసెక్కులు వదులుతున్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News