అక్షరటుడే, ఇందూరు: Konda Laxman Bapuji | నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ (Konda Laxman Bapuji) అని బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పల్నాటి కార్తీక్ అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని పురస్కరించుకొని వినాయక్‌నగర్ విగ్రహాల పార్క్ వద్ద పూలమాలవేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కార్తీక్ మాట్లాడుతూ.. తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమానికి ఊపిరిపోసి ప్రత్యేక రాష్ట్ర కాంక్షను చాటాడన్నారు. 96 ఏళ్ల వయసులో ఎముకలు కొరికే చలిలో ఢిల్లీలోని జంతర్ మంతర్ (Jantar Mantar) వద్ద తెలంగాణ కోసం దీక్ష చేసిన మహనీయుడని కొనియాడారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు బొట్టు వెంకటేష్, మాజీ కార్పొరేటర్లు ఎనుగందుల మురళి, సిరిగాధ ధర్మపురి, ఆరుష్ తదితరులు పాల్గొన్నారు.