అక్షరటుడే, వెబ్‌డెస్క్: Atlanta Electricals | దేశీయ స్టాక్ మార్కెట్‌లోకి మెయిన్‌బోర్డ్(Mainboard) నుంచి మరో ఐపీవో(IPO) వస్తోంది. అట్లాంటా ఎలక్ట్రికల్స్ కంపెనీ సబ్‌స్క్రిప్షన్ సోమవారం ప్రారంభం కానుంది. ఒక్కో షేరుకు జీఎంపీ(GMP) రూ. 140గా ఉంది.
పవర్, ఆటో, ఇన్వర్టర్ డ్యూటీ ట్రాన్స్‌ఫార్మర్‌ల తయారీలో దేశంలోని ప్రముఖ సంస్థలలో అట్లాంటా ఎలక్ట్రికల్స్ (Atlanta Electricals) ఒకటి. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న ఈ కంపెనీకి మూడు దశాబ్దాల అనుభవం ఉంది. ఈ కంపెనీ రూ. 687.34 కోట్లు సమీకరించడం కోసం ఐపీవోకు వస్తోంది. ఇందులో రూ. 2 ఫేస్ వాల్యూ(Face value)గల తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయడం ద్వారా రూ. 400 కోట్లు సమీకరించనుంది. మిగిలినది ఆఫర్ ఫర్ సేల్(OFS) ద్వారా విక్రయించనుంది.
Atlanta Electricals | ప్రైస్ బాండ్..
కంపెనీ ఒక్కో షేరు ధరను రూ. 718 నుంచి రూ. 754 గా నిర్ణయించింది. ఒక లాట్‌లో 19 షేర్లున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు ఒక లాట్(Lot) కోసం రూ. 14,326తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
Atlanta Electricals | కోటా, జీఎంపీ..
క్యూఐబీ(QIB)లకు 50 శాతం, రిటైల్ ఇన్వెస్టర్లకు 35 శాతం, ఎన్‌ఐఐలకు 15 శాతం కోటా కేటాయించారు. ఈ కంపెనీ షేర్ల జీఎంపీ రూ. 140 గా ఉంది. అంటే లిస్టింగ్ సమయంలో ఒక్కో ఈక్విటీ షేరుపై 18.5 శాతం లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Atlanta Electricals | కంపెనీ ఆర్థిక పరిస్థితి..
2023 -24 ఆర్థిక సంవత్సరంలో రూ. 872.05 కోట్ల ఆదాయాన్ని(Revenue) ఆర్జించిన కంపెనీ.. 2024 -25 ఆర్థిక సంవత్సరంలో ఆదాయాన్ని రూ. 1,250 కోట్లకు పెంచుకుంది. ఇదే సమయంలో నికర లాభం(Net profit) రూ. 63.36 కోట్లనుంచి రూ. 118.65 కోట్లకు చేరడం గమనార్హం. ఆస్తులు కూడా రూ. 559.25 కోట్లనుంచి రూ. 866.19 కోట్లకు చేరింది. డెబిట్ టు ఈక్విటీ రేషియో 0.40 గా ఉంది.
Atlanta Electricals | ముఖ్యమైన తేదీలు..
- ఐపీవో ప్రారంభ తేదీ: సెప్టెంబర్ 22.
- ముగింపు తేదీ: సెప్టెంబర్ 24.
- అలాట్‌మెంట్ ఖరారు: సెప్టెంబర్ 25.
- లిస్టింగ్ తేదీ: సెప్టెంబర్ 29.(బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్ట్ అవుతుంది)