అక్షరటుడే, వెబ్‌డెస్క్: IPO | దేశీయ స్టాక్ మార్కెట్(Domestic stock market)లో లిస్టవడం కోసం కంపెనీలు క్యూ కడుతున్నాయి. 22 నుంచి ప్రారంభమయ్యే వారంలో ఏకంగా 29 కంపెనీలు పబ్లిక్ ఇష్యూ(Public issue)కు వస్తున్నాయి. ఇందులో 12 కంపెనీలు మెయిన్‌బోర్డుకు చెందినవి కావడం గమనార్హం. కాగా నూతన వారంలో తొమ్మిది కంపెనీలు లిస్టవనున్నాయి.
IPO | మెయిన్‌బోర్డ్ ఐపీవోలు..
మెయిన్‌బోర్డ్‌నుంచి 12 పబ్లిక్ ఇష్యూలు ప్రారంభం కాబోతున్నాయి. గణేశ్ కన్జూమర్ ప్రొడక్ట్స్, అట్లాంటా ఎలక్ట్రికల్స్(Atlanta Electricals ), సోలార్ వరల్డ్ ఎనర్జీ సొల్యూషన్స్, ఆనంద్ రాఠీ షేర్, జారో ఇన్‌స్టిట్యూట్, బీఎండబ్ల్యూ వెంచర్స్, జైన్ రిసోర్స్ రీసైక్లింగ్, ఈప్యాక్ ప్రీఫ్యాబ్ టెక్నాలజీస్, జిన్‌కౌషల్ ఇండస్ట్రీస్(Jinkushal Industries), ట్రాల్ట్ బయో ఎనర్జీ, పేస్ డిజిటెక్ కంపెనీల ఐపీవోలు అందుబాటులో ఉండనున్నాయి.
గణేశ్ కన్జూమర్ ప్రొడక్ట్స్, అట్లాంటా ఎలక్ట్రికల్స్ కంపెనీల సబ్‌స్క్రిప్షన్ 22న ప్రారంభమై, 24న ముగుస్తుంది. కంపెనీల షేర్లు 29న బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్టవుతాయి. Seshaasai Technologies, సోలార్ వరల్డ్ ఎనర్జీ సొల్యూషన్స్, ఆనంద్ రాఠీ షేర్, జారో ఇన్‌స్టిట్యూట్ బిడ్డింగ్ 23న ప్రారంభమవుతుంది. 25 వరకు కొనసాగుతుంది. ఈ కంపెనీల షేర్లు 30న లిస్టవనున్నాయి.
బీఎండబ్ల్యూ వెంచర్స్, జైన్ రిసోర్స్ రీసైక్లింగ్, ఈప్యాక్ ప్రీఫ్యాబ్ టెక్నాలజీస్ (Epack Prefab Technologies) పబ్లిక్ ఇష్యూ 24న మొదలై 26న ముగుస్తుంది. ఆయా కంపెనీలు అక్టోబర్ ఒకటో తేదీన లిస్టవుతాయి.
జిన్‌కౌషల్ ఇండస్ట్రీస్, ట్రాల్ట్ బయో ఎనర్జీల సబ్‌స్క్రిప్షన్ ఈనెల 25న ప్రారంభమై 29 వరకు కొనసాగుతుంది. ఈ కంపెనీలు అక్టోబర్ 3వ తేదీన లిస్టింగ్‌కు రానున్నాయి.
పేస్ డిజిటెక్ ఐపీవో (Pace Digitek IPO) ఈనెల 26న ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
IPO | ఎస్‌ఎంఈ ఐపీవోలు..
ఎస్‌ఎంఈ సెగ్మెంట్‌నుంచి 17 కంపెనీలు ఐపీవోకు వస్తున్నాయి. ప్రైమ్ కేబుల్ ఇండస్ట్రీస్ ఎన్‌ఎస్‌ఈ ఎస్‌ఎంఈ, సాల్వెక్స్ ఎడిబుల్స్ బీఎస్‌ఈ ఎస్‌ఎంఈల సబ్‌స్క్రిప్షన్ 22న ప్రారంభమవుతుంది.
ఎకోలైన్ ఎక్జిమ్, మ్యాట్రిక్స్ జియో సొల్యూషన్స్ ఎన్‌ఎస్‌ఈ ఎస్‌ఎంఈలు, ట్రూ కలర్స్ (True Colors ), ఎన్‌ఎస్‌బీ బీపీవో సొల్యూషన్స్, ఆప్టస్ ఫార్మా, భరత్ రోహన్ ఎయిర్‌బోర్నే ఇన్నోవేషన్ బీఎస్‌ఈ ఎస్‌ఎంఈల సబ్‌స్క్రిప్షన్ 23న మొదలవుతుంది.
గురునానక్ అగ్రికల్చర్ ఎన్‌ఎస్‌ఈ ఎస్‌ఎంఈ, ప్రరుప్ టెక్నాలజీస్, రిద్ధి డిస్లే ఎక్విప్‌మెంట్స్, సిస్టమాటిక్ ఇండస్ట్రీస్, జస్టో రియల్ ఫన్‌టెక్ (Justo Realfintech) బీఎస్‌ఈ ఎస్‌ఎంఈల సబ్‌స్క్రిప్షన్ 24న ప్రారంభం కానుంది.
టెల్గే ప్రాజెక్ట్స్, చాటర్‌బాక్స్ టెక్నాలజీస్, భవిక్ ఎంటర్‌ప్రైజెస్ బీఎస్‌ఈ ఎన్‌ఎంఈల సబ్‌స్క్రిప్షన్ ఈనెల 25న మొదలవనుంది. డీఎస్‌ఎం ఫ్రెష్ ఫుడ్స్ బీఎస్‌ఈ ఎస్‌ఎంఈ పబ్లిక్ ఇష్యూ ఈనెల 26న ప్రారంభమవుతుంది.
IPO | లిస్టింగ్‌కు ఐదు కంపెనీలు..
మెయిన్‌బోర్డ్‌కు చెందిన ఐదు కంపెనీల షేర్లు వచ్చేవారంలో లిస్టింగ్‌కు రానున్నాయి. ఇందులో యూరో ప్రతీక్ సేల్స్ కంపెనీ 23న లిస్టవనుంది. వీఎంఎస్ టీఎంటీ కంపెనీ షేర్లు 24న, ఐవాల్యూ ఇన్ఫోసొల్యూషన్స్ షేర్లు 25న, సాత్విక్ గ్రీన్ ఎనర్జీ, జీకే ఎనర్జీ (GK Energy) షేర్లు 26న లిస్టవుతాయి.
ఎస్‌ఎంఈ సెగ్మెంట్‌నుంచి నాలుగు కంపెనీలు లిస్టింగ్‌కు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో టెక్‌డీ సైబర్ సెక్యూరిటీ (TechD Cybersecurity) షేర్లు సోమవారం ఎన్‌ఎస్‌ఈలో లిస్టవుతాయి. సంపత్ అల్యూమినియం కంపెనీ ఈనెల 24న బీఎస్‌ఈలో, జేడీ కేబుల్స్ షేర్లు 25న బీఎస్‌ఈలో, సిద్ధి కాట్‌స్పిన్ షేర్లు 26న ఎన్‌ఎస్‌ఈలో లిస్టవనున్నాయి.