అక్షరటుడే, వెబ్‌డెస్క్: Deepika Padukone | బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపిక పదుకోన్ (Deepika Padukone) ప్రస్తుతం తీవ్ర విమర్శలకు గురవుతోంది. వరుసగా రెండు పాన్ ఇండియా క్రేజీ ప్రాజెక్టులు నుంచి ఆమె వైదొలగడం సినీ వర్గాల్లో గట్టిగానే చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ దర్శకులు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందే ‘Spirit’, నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న భారీ విజువల్ ఎపిక్ ‘Kalki 2898 AD’ నుండి దీపిక తప్పుకుంది.
ఈ నిర్ణయం ఆమె కెరీర్‌పై గణనీయమైన ప్రభావం చూపుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఈ రెండు సినిమాల వల్ల దీపికకు కనీసం రూ. 40 కోట్ల రెమ్యూనరేషన్ లభించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కేవలం పారితోషికమే కాదు, ఈ స్థాయి సినిమాల్లో నటించడం ద్వారా వచ్చే బ్రాండ్ వ్యాల్యూ, ఆఫర్స్, ప్రమోషనల్ డీల్‌లు దీపికాకి చాలా ఉపయోగపడేవని విశ్లేషకులు అంటున్నారు.
Deepika Padukone | షారూఖ్‌కే ప్రాధాన్యత?
అయితే దీపికా పదుకొణే ఈ రెండు సినిమాలు వదులుకోవడం వెనుక కారణం షారూఖ్‌తో నటిస్తున్న కింగ్ అని ప్రచారం జరుగుతుంది. ఇటీవలే మాట్లాడుతూ .. “నా 18 ఏళ్ల కెరీర్‌లో ఒక్క హీరోతో 6సార్లు పనిచేసినది షారూఖ్ గారితో అని చెప్పడం కూడా వీటికి బలం చేకూర్చింది.
కానీ నెటిజన్లు మాత్రం దీన్ని ఓల్డ్ స్కూల్ మైండ్‌సెట్గా విమర్శిస్తున్నారు. ప్రభాస్ (Hero Prabhas) వంటి 45ఏళ్ల క్రేజ్ ఉన్న హీరోతో నటించే అవకాశం రాగా, దాన్ని వదులుకోవడం పట్ల కొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 60కి దగ్గరయ్యే షారూఖ్ ఖాన్‌తో (Shah Rukh Khan) సినిమాలు చేస్తూ, మరోవైపు టాప్ యంగ్ హీరోలతో నటించే అవకాశాలను వదులుకోవడం దీపికకు పెద్ద నష్టమే అవుతుందని వ్యాఖ్యానిస్తున్నారు.
దీపిక తీసుకున్న నిర్ణయంపై కొందరు నెటిజన్లు ఘాటు కామెంట్లు చేస్తున్నారు. “ప్రభాస్‌తో రెండు సినిమాల్లో ఛాన్స్ వస్తే వదిలేయడం అవివేకం”, “ఇప్పటి ట్రెండ్ తెలిసిన హీరోయిన్ అయితే ఇలాంటి తప్పు చేయదు” అంటూ సెటైర్లు వేస్తున్నారు. దీపిక ట్రెండ్‌తో కలవలేకపోతే ఇంకా పెద్ద బ్యానర్స్ కూడా ఆమెను దూరం పెట్టే అవకాశం ఉందని కూడా పరిశీలకులు చెబుతున్నారు.
ఇప్పటికే దీపికకు (Deepika) ఏదో రకంగా బ్యాడ్ ఫేజ్ కొనసాగుతోందని భావిస్తున్నారు. ఇప్పుడు రెండు క్రేజీ ప్రాజెక్టులను వదిలేయడం ద్వారా ఆమె పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందని చెబుతున్నారు. స్టార్ హీరోలతో పాటు, హిట్ డైరెక్టర్ల సినిమాల్లో నటించినప్పుడే ఆమెకు ఉన్న బ్రాండ్ ఎండార్స్‌మెంట్ వ్యాల్యూ పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు.