అక్షరటుడే, వెబ్డెస్క్: Suryapet District | తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా కేంద్రంలో (Suryapet district Center) కన్నతండ్రే రాక్షసంగా మారిన దారుణ ఘటన ఒక్కసారిగా స్థానికులను శోక సంద్రంలో ముంచేసింది. మద్యం మత్తులో కుమార్తెపై పాశవికంగా దాడి చేసిన తండ్రి (Father) చేతిలో 12 నెలల పసిపాప బలైంది.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. నాగారం మండలం డి. కొత్తపల్లికి చెందిన గైగుల్ల వెంకటేశ్వర్లు, నాగమణి దంపతుల పాప భవిజ్ఞ. వారు ప్రస్తుతం సూర్యాపేటలోని ప్రియాంక కాలనీలో (Priyanka colony) అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. శుక్రవారం రాత్రి వెంకటేశ్వర్లు మద్యం మత్తులో ఇంటికి చేరాడు. భార్య నాగమణితో తీవ్ర వాగ్వాదం జరిగింది.
Suryapet District | కోపంతో ఎంత పని చేశాడు..
తల్లిదండ్రుల గొడవ మధ్యలో చిన్నారి భయంతో ఏడవడం మొదలుపెట్టింది. ఇదే సమయంలో మానవత్వం మరచిన వెంకటేశ్వర్లు పాపపై రాక్షసంగా ప్రవర్తించాడు. చిన్నారి కాళ్లు పట్టుకొని నేలకేసి బలంగా కొట్టాడు. ఈ దాడిలో భవిజ్ఞకు తలకు తీవ్ర గాయాలయ్యాయి. చిన్నారి గాయాలు తీవ్రమవడంతో తల్లిదండ్రులు ఆమెను స్థానిక ఆస్పత్రికి (local hospital) తరలించారు.
కానీ అప్పటికే చిన్నారి పరిస్థితి విషమించిందని వైద్యులు తెలిపారు. తలకు మరియు శరీర భాగాలకు తీవ్ర గాయాలు కావడంతో భవిజ్ఞ చికిత్స పొందుతూనే మరణించింది. చిన్నారి మృతితో కుటుంబం (Family) శోకసంద్రంలో మునిగింది. భర్త చేతిలో తన పసికందు మృత్యువాతపడటాన్ని తల్లి నాగమణి తట్టుకోలేక గుండెలదిరేలా రోదించింది. స్థానికులు కూడా ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
చిన్నారి తల్లి నాగమణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు (police Case) నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు వెంకటేశ్వర్లును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మద్యం మత్తులో మానవత్వాన్ని మరిచి జరిగిన ఈ దారుణం పై సంఘీభావంతో పాటు తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. బాలలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టేలా సమాజం ఒక్కటై నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పిల్లల భద్రత కోసం చట్టాలు కఠినంగా అమలు కావాలన్న డిమాండ్ జోరందుకుంది.