- Advertisement -
Homeతాజావార్తలుNara Lokesh | గల్ఫ్‌ దేశంలో ఇబ్బందులు ప‌డుతున్న‌ ఏపీ మహిళ.. స్పందించిన మంత్రి నారా...

Nara Lokesh | గల్ఫ్‌ దేశంలో ఇబ్బందులు ప‌డుతున్న‌ ఏపీ మహిళ.. స్పందించిన మంత్రి నారా లోకేష్

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Nara Lokesh | ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) రాష్ట్రానికి చెందిన ఓ మహిళ గల్ఫ్ దేశంలో చిక్కుల్లో పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కడప జిల్లాలోని (Kadapa district) రాయచోటి సమీపంలోని పల్లెటూరుకు చెందిన చెన్నంశెట్టి జయశ్రీ, మూడునెలల క్రితం కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపర్చేందుకు కువైట్‌ వెళ్లింది.

అయితే అక్కడ తాను తీవ్ర వేధింపులు ఎదుర్కొంటున్నానని, తట్టుకోలేని స్థితిలో ఉన్నానని కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి తెలుపింది. తాను పనిచేస్తున్న యజమానులు వేధిస్తున్నారని, భారత్‌కు తిరిగి రావాలంటే ఖర్చులకు కూడా డబ్బుల్లేవని వాపోయింది.

- Advertisement -

Nara Lokesh | నేనున్నాను..

జయశ్రీ కుటుంబ సభ్యులు మంత్రి నారా లోకేష్‌కు (Minister Nara Lokesh) ఈ విషయాన్ని తెలియజేయగా, వెంటనే ఆయన స్పందించారు. బాధితురాలిని దేశానికి తీసుకురావడంలో పూర్తి సహాయసహకారాలు అందిస్తానని భరోసా ఇచ్చారు. ప్రస్తుతం జయశ్రీ కువైట్‌లోని ALADAN AL QASOUR BLOCK-1, HOUSE-1 అనే ప్రాంతంలో ఉన్నారని, ఆమెను సంప్రదించేందుకు వాట్సాప్ నెంబర్: 9160011780 ఉపయోగించవచ్చని తెలిపారు.

ఈ నేపథ్యంలో తన కార్యాలయాన్ని అలర్ట్ చేసిన నారా లోకేష్, సంబంధిత అధికారులతో సంప్రదింపులు ప్రారంభించారు. ఇప్పటికే ఇలాగే పలువురు గల్ఫ్ బాధితులను క్షేమంగా స్వదేశానికి తీసుకొచ్చిన నారా లోకేష్, ఇప్పుడు జయశ్రీ విషయంలోనూ తక్షణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

గల్ఫ్ దేశాల్లో (Gulf Country) ఉద్యోగాల కోసం వెళ్లే తెలుగు యువతీ యువకులు, మహిళలు ఇలాంటి మోసాలకు గురికాకుండా జాగ్రత్తగా ఉండాలని, అనుమానాస్పద ఏజెంట్ల మాటలు నమ్మరాదని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు, గల్ఫ్ దేశాల్లో ఇబ్బందుల్లో ఉన్నవారిని గుర్తించి తక్షణమే సహాయం చేయడంలో ఏపీ ప్రభుత్వం చూపుతున్న వేగం ప్రశంసనీయం.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News