అక్షరటుడే, హైదరాబాద్: Raids in Caps Gold | రూ. కోట్లలో సంపాదిస్తూ.. ఆదాయ పన్ను ఎగవేతకు పాల్పడుతున్న అక్రమార్కుల భరతం పడుతున్నారు ఐటీ అధికారులు. తాజాగా బంగారు వర్తకులపై దృష్టి సారించారు.
తెలంగాణ రాష్ట్రంలోకి దేశ వ్యాప్తంగా ఉన్న ఐటీ అధికారులు రంగప్రవేశం చేశారు. గత కొద్ది రోజులుగా బంగారం వ్యాపారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు.
మొదట సికింద్రాబాద్‌లోని క్యాప్స్ గోల్డ్‌పై దృష్టి సారించారు. గత ఐదు రోజులుగా ఇక్కడి దుకాణాల్లో రైడ్స్ కొనసాగిస్తున్నారు. ఇక్కడి దుకాణాల్లో బంగారం కొనుగోలు చేసే ఆయా జిల్లాల వర్తకులపై దృష్టి సారించారు.
ఇక క్యాప్స్ గోల్డ్ విషయానికి వస్తే.. ఐదో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్‌లోని క్యాప్స్ గోల్డ్ కార్యాలయం సీజ్ చేశారు. ల్యాప్‌టాప్‌లు, పెన్‌డ్రైవ్‌లు స్వాధీనం చేసుకున్నారు.
కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు ఐటీ అధికారులు. చందా శ్రీనివాస్, అభిషేక్‌ను ఇప్పటికే విచారించారు. హైదరాబాద్, గుంటూరు, విజయవాడలో బంధువులను క్యాప్స్ గోల్డ్ యాజమాన్యం బినామీలుగా ఉంచినట్లు విచారణలో తేలింది.
క్యాప్స్ గోల్డ్ బంగారం స్కీమ్‌లు నడిపిస్తున్నట్లు గుర్తించారు. నగదు ట్రాన్సాక్షన్ విషయంలో అవకతవకలను కూడా ఐటీ అధికారులు గుర్తించారు. బంజారాహిల్స్ రోడ్ నంబరు 10తో పాటు, మహంకాళి స్ట్రీట్‌లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.
సికింద్రాబాద్‌లో సోదాలు కొనసాగిస్తున్న సమయంలో స్థానికుల పోలీసుల సాయం తీసుకోకుండా.. నేరుగా ఆర్మీతో రంగంలోకి దిగారు. సైన్యం సాయంతో రైడ్స్ చేస్తున్నారు.
Raids in Caps Gold | నిజామాబాద్ జిల్లాలో..
సికింద్రాబాద్‌లో సోదాలు కొనసాగిస్తూనే దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి ఐటీ అధికారులను పిలిపించి, ఆయా జిల్లాలకు పురమాయించారు. క్యాబ్ గోల్డ్‌లో పసిడి కొనుగోలు చేసే ఆయా జిల్లాల్లోని వర్తకుల దుకాణాల్లోనూ దాడులు జరిపారు.
ఇక జిల్లాల విషయానికి వస్తే.. నిజామాబాద్, నిర్మల్‌లోని రాజు సేట్, మెట్పల్లి, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో ఇప్పటికే దాడులు జరిగాయి.
నిజామాబాద్ జిల్లాలో ఇటీవల ఐటీ సోదాలు కలకలం రేపాయి. పరిమితికి మించి లావాదేవీలు జరిపిన వారిని టార్గెట్ చేసుకుని దాడులు చేపట్టారు.
నిజామాబాద్ గంజ్ Ganj లోని పలు బంగారు దుకాణాల్లో శుక్రవారం ఉదయం నుంచి ఐటీ IT అధికారులు సోదాలు చేపట్టారు.
ముఖ్యంగా ఓ రెండు దుకాణాల్లో ఇన్కమ్ టాక్స్ రిటర్నుల income tax returns కు సంబంధించి వ్యత్యాసాలు గుర్తించిన అధికారులు సోదాలు జరిపారు.
ఈ క్రమంలో ఆదాయ పన్ను చెల్లింపుల్లో పెద్ద ఎత్తున తేడాలు గుర్తించినట్లు తెలుస్తోంది. కాగా, ఈ విషయమై సంబంధిత అధికారులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
Secunderabad Caps Gold | బంగారం బిస్కెట్ల దందా
నిజామాబాద్ గంజ్‌లోని పలు గోల్డ్ దుకాణాల్లో బంగారం బిస్కెట్ల Gold biscuits దందా కొనసాగిస్తున్నారు. ఈ విషయమై ఐటీ అధికారులకు అందిన ప్రాథమిక సమాచారం ఆధారంగా తనిఖీలు నిర్వహించినట్లు తెలుస్తోంది.
గత కొంత కాలంగా రూ. కోట్లలో దందా కొనసాగిస్తున్నప్పటికీ ఆదాయ పన్ను రిటర్నుల్లో మాత్రం లెక్క చూపట్లేదని సమాచారం.
కాగా, తనిఖీల సమయంలో అధికారులు పలు దస్త్రాలతోపాటు ఆధారాలు సేకరించినట్లు తెలిసింది. మరో వైపు ఐటీ సోదాల నేపథ్యంలో ఇతర బంగారు దుకాణాల యజమానులు అలెర్ట్ అయ్యారు. ముందస్తుగా దుకాణాలు మూసివేసి జాగ్రత్త పడ్డారు.
Nizamabad districtలో తాజా సోదాలకు సంబంధించి అధికారులు ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ పెద్ద మొత్తంలో పన్ను ఎగవేతకు పాల్పడినట్లు తెలుస్తోంది.