అక్షరటుడే, వెబ్‌డెస్క్: Gold Prices sep 21 | పండుగ సీజన్ ప్రారంభం కావడంతో దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఇప్పటికే ధరలు రికార్డు స్థాయిలో ఉండగా, తాజాగా మరింత పెరగడంతో వినియోగదారులకు షాక్ తగిలినట్టైంది.
నేడు (సెప్టెంబర్ 21) బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే.. 24 క్యారెట్ల బంగారం Gold పది గ్రాముల ధర రూ.1,12,150 గా రికార్డ్ కాగా , 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,02,800 గా ట్రేడ్ అయింది.
ఇక వెండి కిలో ధర రూ.100 పెరిగి.. రూ.1,35,000లుగా నమోదైంది. దసరా, దీపావళి లాంటి ప్రధాన పండుగలు దగ్గర పడుతున్న నేపథ్యంలో బంగారం కొనుగోళ్లు సుమారు 37% పెరిగాయి.
Gold Prices sep 21 | కారణాలు ఇవే..
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు కూడా బంగారాన్ని మరింత ఆకర్షణీయమైన పెట్టుబడి మార్గంగా మార్చింది. జియోపాలిటికల్ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణ భయాలు, రష్యా-ఉక్రెయిన్, మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు గ్లోబల్ మార్కెట్లలో అస్థిరతకు దారితీశాయి.
దీని ప్రభావం బంగారం, వెండి రేట్లపై పడింది.పండుగల డిమాండ్, అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా భవిష్యత్తులో బంగారం, వెండి ధరలు Silver Prices మరింత పెరిగే అవకాశముందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
బంగారం కొనుగోలు చేసే వారు ప్రస్తుతం మార్కెట్‌ను బాగా పరిశీలించి, కొనుగోలు టైమింగ్‌ను నిర్ణయించుకోవాలని సూచిస్తున్నారు.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే.. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ. 1,12,150 గా నమోదు కాగా .. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,02,800 గా ట్రేడ్ అయింది. ఇక కిలో వెండి ధర రూ. 1,45,000 గా నమోదైంది.
విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 1,12,150 గా ట్రేడ్ కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,02,800 గా ట్రేడ్ అయింది. కిలో వెండి ధర రూ. 1,45,000 గా నమోదైంది.
ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,12,300 గా ట్రేడ్ కాగా, 22 క్యారెట్ల ధర రూ. 1,02,950 గా నమోదైంది. కిలో వెండి ధర రూ. 1,35,000 గా ట్రేడ్ అయింది.
ఇక ముంబయిలో 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,12,150 గా ట్రేడ్ కాగా , 22 క్యారెట్ల ధర రూ. 1,02,800 గా నమోదైంది. వెండి ధర కిలో రూ. 1,35,000 గా ట్రేడ్ అయింది.
ఇక చెన్నైలో Chennai 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,12,260 గా నమోదు కాగా.. 22 క్యారెట్ల ధర రూ. 1,02,900 గా ట్రేడ్ అయింది. వెండి ధర కిలో రూ. 1,45,000 గా నమోదైంది.
బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ. 1,12,150 గా ట్రేడ్ కాగా, 22 క్యారెట్ల ధర రూ. 1,02,800 గా నమోదైంది. వెండి ధర కిలో రూ. 1,33,600 గా ట్రేడ్ అయింది.