- Advertisement -
Homeక్రీడలుAsia cup 2025 | సూపర్-4లో లంక‌కు షాక్ ఇచ్చిన బంగ్లా.. నాలుగు వికెట్ల తేడాతో...

Asia cup 2025 | సూపర్-4లో లంక‌కు షాక్ ఇచ్చిన బంగ్లా.. నాలుగు వికెట్ల తేడాతో విజ‌యం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: ఆసియా కప్ 2025 (Asia Cup 2025) టోర్నీలో ఇప్పుడు సూపర్-4 ఫైట్ న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. శనివారం జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన బంగ్లా జట్టు శ్రీలంకను 4 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ముందుగా బౌలింగ్‌లో కట్టుదిట్టంగా ఆడిన బంగ్లా.. అనంతరం బ్యాటింగ్‌లోనూ పరిపక్వత చూపింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. స్టార్ ఆల్‌రౌండర్ డసన్ షనక అద్భుతంగా ఆడుతూ 37 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 64 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతనికి కుశాల్ మెండిస్ (34), పాతుమ్ నిస్సంక (22) తోడయ్యారు.

Asia cup 2025 | శ్రీలంకకు షాక్..

బంగ్లా (Bangladesh) బౌల‌ర్స్​లో ముస్తాఫిజుర్ రెహ్మాన్ 3/20తో రాణించ‌గా, మెహ్‌దీ హసన్ 2/25, టస్కిన్ అహ్మద్ ఒక వికెట్ తీసుకున్నారు. లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ అద్భుతమైన బ్యాటింగ్ చేసింది. ముఖ్యంగా ఓపెనర్ సైఫ్ హసన్ (61), టౌహిడ్ హృదయ్ (58) కీల‌క ఇన్నింగ్స్ ఆడారు. ఈ ఇద్దరి హాఫ్ సెంచరీలే విజయం బాట పట్టించాయి. అవసరమైన సమయంలో స్ట్రైక్ రొటేషన్, బౌండరీలు బాద‌డంతో బంగ్లా జ‌ట్టు సులువుగా గెలిచింది. బంగ్లాదేశ్‌ గెలవడానికి 6 బంతుల్లో 5 పరుగులు అవసరం కాగా, జాకెర్ అలీ బౌండరీ కొట్టి స్కోరు సమం చేశాడు. కానీ వెంటనే బౌల్డ్ అయ్యాడు. మెహ్‌దీ హసన్ కూడా వెంటనే వెనుదిరిగాడు. చివరికి షమీమ్ హొస్సేన్ (1 నాటౌట్‌) ఒక సింగిల్ తీయడంతో బంగ్లా విజయం సాధించింది.

- Advertisement -

శ్రీలంక Srilanka బౌలింగ్ విష‌యానికి వ‌స్తే.. వానిందు హసరంగా 2/22, డసన్ షనక 2/21, నువాన్ తుషారా 1 వికెట్, దుష్మంత చమీరా ఒక వికెట్ తీశారు. ఈ విజయంతో బంగ్లాదేశ్ సూపర్-4 దశను విజయవంతంగా ప్రారంభించింది. టోర్నీలో నెక్స్ట్ మ్యాచ్‌లకు ఇది మరింత ఉత్సాహాన్నిచ్చే అవకాశం ఉంది. మరొకవైపు, శ్రీలంక తన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని తిరిగి పుంజుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఈ రోజు భారత్​ – పాకిస్తాన్​ మ‌ధ్య సూప‌ర్ ఫోర్‌లో తొలి ఫైట్ జ‌ర‌గ‌నుంది. మ‌రి ఈ మ్యాచ్‌లో ఎవ‌రు గెలుస్తార‌నేది చూడాల్సి ఉంది.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News